Home Authors Posts by MARUPATLA JAYAPAL

MARUPATLA JAYAPAL

668 POSTS 0 COMMENTS
హైదరాబాద్ నగరంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లో చోరబడి బంగారం, డబ్బులు దోచుకెళ్లారు. ఈ ఘటన మలక్ పెట్ అక్భర్ కాలనీలో చోటు చేసుకుంది. షామిమ్ విల్లా అనే ఇంటికి తాళం వేసిన అరగంట తర్వాత దోపిడీ దొంగలు చొరబడ్డారు. బీరువా నుండి 16 తులాల బంగారు నగలు, లక్ష 50వేల నగదును ఎత్తుకెళ్లారు.బాధితుడు ఇంటి యజమాని మజీద్ ఉడీన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సూర్యాపేట జిల్లా చివ్వెంలలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది విద్యార్థులు గాయపడ్డారు. టూరిస్టు బస్సును లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన విద్యార్థులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 60 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా భద్రాచలం విహారయాత్రకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.క్షతగాత్రులు నల్గొండ జిల్లా చండూరు విద్యార్థులుగా గుర్తించారు. .
ఐటీ పరిమితి రూ.5 లక్షలకు పెంపు? మధ్యతరగతికి మోదీ మెగా రాయితీ! తాత్కాలిక బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం న్యూఢిల్లీ: మధ్య తరగతి, ఉద్యోగ వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మరో భారీ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ వర్గాలకు ఆదాయపు పన్ను పరిమితిని ప్రస్తుతం ఉన్న 2.5 లక్షల నుంచి రూ 5 లక్షలకు పెంచాలని యోచిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల దెబ్బతిన్న ఈ వర్గాలకు ఈ ఉపశమనం కలగజేస్తేనే ఎన్నికల్లో వారి నుంచి...
4 కోట్ల మంది రద్దీకి తగ్గట్టుగా శంషాబాద్‌ ప్రణాళికలు పట్టాలెక్కితే వరంగల్‌, నిజామాబాద్‌, కొత్తగూడెంలలో పనులకు శ్రీకారం! అమరావతి,. తెలుగు రాష్ట్రాల్లోని విమానాశ్రయాలకు ఈ ఏడాది మహర్దశ పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం ఆరు ఎయిర్‌పోర్టులను బహుముఖంగా అభివృద్ధిపర్చేందుకు నిర్ణయం జరగ్గా.. అందులో తెలంగాణలోని శంషాబాద్‌, ఏపీకి చెందిన విజయవాడ, విశాఖ, తిరుపతి, రాజమహేంద్రవరం, కడప విమానాశ్రయాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వ ప్రణాళికలు పట్టాలెక్కితే వరంగల్‌, నిజామాబాద్‌, కొత్తగూడెం కూడా త్వరలో లిస్ట్‌లో చేరే అవకాశం ఉందంటున్నాయి....
👉🏾సర్పంచి అభ్యర్థులకు గులాబీ! 👉🏾వార్డు సభ్యులకు తెలుపు! 👉🏾రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. సంబంధిత సిబ్బంది బ్యాలెట్‌ బాక్సులు, ఇతర పోలింగ్‌ సామగ్రిని సిద్ధం చేస్తున్నారు! 👉🏾ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎం ఉపయోగించగా, సర్పంచి ఎన్నికలు పాత పద్ధతి అంటే బ్యాలెట్‌ విధానంలో జరుగనుండటంతో పల్లెల్లో ఆసక్తి నెలకొంది! 👉🏾ఒక్కో పంచాయతీలో ఓటరు...
జగన్‌కి సాయం చేసేందుకే కేసీఆర్‌ తలసానిని ఏపీకి పంపించారని ఈరోజు మీడియా సమావేశంలో గాటుగా విమర్సించారు. బీసీలకు తెలంగాణ కంటే ఏపీలోనే అన్ని విధాల న్యాయం జరుగుతోందని బోనబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. చంద్రబాబు నాయుడిని విమర్శించటమే ఫ్యాషన్‌గా పెట్టుకున్నారు. గుంటూరులో తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి నిర్వహకుడు బోనబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ నాయుడు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వ్యాఖ్యాలను తీవ్రంగా తప్పు బట్టారు. జగన్‌కి సాయం చేసేందుకే తలసానికి కేసీఆర్‌ ఏపీకి...
వరంగల్ పశ్చిమ: బాలసముద్రం: ఈనెల 16న వేయి స్తంభాల గుడి ప్రాంగణంలో పరంపర సంస్థ వారి ఆధ్వర్యంలో గుడి సంబరాలు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న సందర్భంగా నేడు వరంగల్ నగర కళాకారులు ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన గౌరవ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారు.. 👉కళలకు పుట్టినిల్లు ఓరుగల్లు.. 👉కళాకారుల అభిరుచులకు అనుగుణంగా అతి త్వరలోనే ఒక వేదిక ఏర్పరుచుకుందాం.. 👉ఈనెల 16న వేయి స్తంభాల గుడి ప్రాంగణంలో పరంపర సంస్థ ఆధ్వర్యంలో ...
జయశంకర్ భూపాలపల్లి :- నేడు రేగొండ మండలం పోచంపల్లి గ్రామంలో కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని వారి సందేశాన్ని ప్రసంగించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గౌరవ శ్రీ.గండ్ర వెంకటరమణ రెడ్డి గారు మరియు గ్రామ కాంగ్రెస్ పార్టి సర్పంచ్ రమణ రెడ్డి గారి తరపున ప్రచారం నిర్వహించారు .
భోగి భాగ్యాలు ప్రసాదించాలి.-నారావారిపల్లెలో కుటుంబ సభ్యుల మధ్య భోగి పండుగ జరుపుకున్న మంత్రి నారా లోకేష్ భోగి పండుగ తెలుగు ప్రజలందరికీ భోగభాగ్యాలు ప్రసాదించాలని పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో సోమవారం భోగి పండుగను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు. తెలుగు ప్రజలందరూ ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం...
హైదరాబాద్‌ : సోషల్‌మీడియాలో తనపై, తన కుటుంబ సభ్యులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్‌ షర్మిళ ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం షర్మిళ, భర్త అనిల్‌ కుమార్‌తో కలిసి కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లారు. వీరితో పాటూ కమిషనర్‌ను కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు...
90 Followers
Follow