Home Authors Posts by MARUPATLA JAYAPAL

MARUPATLA JAYAPAL

1116 POSTS 0 COMMENTS
మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆయనపై వేటు వేసింది. సమీక్షా సమావేశంలో ఏఐసీసీసీ ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శి ఆర్.సీ కుంతియా, పీసీసీ అధ్యక్షుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను సస్పెండ్ చేశారు. టీపీసీసీ చీఫ్‌, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ పై సర్వే సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్‌ అడ్డుకున్నారు. దీంతో ఆయనపై సర్వే మండిపడ్డారు. ఇరువురూ పరస్పరం దూషించుకున్నారు....
వరంగల్; అమెరికాలో మరో తెలుగు యువకుడిపై కాల్పుల.. ప్రాణాపాయ స్థితిలో సాయి కృష్ణ. మహబూబాబాద్ పట్టణానికి చెందిన పూస.సాయి కృష్ణ పై అమెరికా లోని మిచిగాన్ రాష్ట్రంలో కాల్పులు. ప్రాణాపాయ స్థితిలో సాయి కృష్ణ. మహబూబాబాద్ పట్టణానికి చెందిన పూస.ఎల్లయ్య/శైలజ దంపతుల కుమారుడు సాయి కృష్ణ.
హైదరాబాద్: ఓ యువతి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎల్‌బీనగర్‌ పిఎస్ పరిధిలో చోటుచేసుకుంది. గుంటి జంగయ్యనగర్‌ కాలనీలో నివాసం ఉండే జ్యోతి జిహెచ్‌ఎంసిలో ఉద్యోగిగా పని చేస్తుండగా ఆమెకు కుమారుడు ప్రదీప్‌కుమార్, కుమారై లక్ష్మిప్రియాంక(19) ఉన్నారు. శనివారం ఉదయం తల్లి ఉద్యోగానికి వెళ్లగా సోదరుడు ప్రదీప్‌కుమార్‌ పని నిమిత్తం బయటకు వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో లక్ష్మిప్రియాంక ఉరేసుకుంది. అయితే,  మధ్యాహ్నం 12గంటల సమయంలో బంధువు ఒకరు ఇంటికి వచ్చి డోర్‌ కొట్టగా ప్రియాంక తీయలేదు. దీంతో...
రంగారెడ్డి: చేవెళ్ల కస్తూర్బా పాఠశాలలో కలుషిత ఆహారం తిని 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో కడుపునొప్పి, వాంతులతో బాధపడుతున్న వారిని వెంటనే  చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని డిఇఒ  అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రిలో విద్యార్థులు కోలుకుంటున్నారని వైద్యలు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో 10 మంది అయ్యప్ప భక్తుల మృతి రోడ్డు ప్రమాదంలో 10 మంది అయ్యప్ప భక్తుల మృతి పుదుకొట్టై : తమిళనాడులోని పుదుకొట్టై వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అయ్యప్ప భక్తులతో వెళ్తున్న ఓ వ్యాన్‌ను ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో 10 మంది అయ్యప్ప భక్తులు మృతి చెందారు. శబరిమల ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులంతా తెలంగాణ రాష్ట్రంలోని మెదక్‌ జిల్లా వాసులు.
ఇక స్టేషన్‌కు వెళ్లాల్సిన పనిలేదు…! హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు పోలీస్‌ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ప్రజల వద్దకే పోలీస్‌ సేవల పేరుతో ఏకరూప పోలీసింగ్‌ సేవలను విస్తరించాలని నిర్ణయించింది. ప్రజల వద్దకు పోలీస్‌ పేరుతో 15 రోజుల పాటు అన్ని గ్రామాలు, పల్లెలు, కాలనీలు, అపార్ట్‌మెంట్లు, వ్యాపార సముదాయాలు.. ఇలా అన్ని ప్రాంతాల్లో సంబంధిత శాంతి భద్రతల విభాగం పోలీసులు పర్యటిస్తారు. అక్కడి ప్రజలతో సమావేశాలు ఏర్పాటుచేసి ఇంకా...
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హంగామా ప్రారంభమైంది.మొదటి విడతలో 4,480 గ్రామ పంచాయతీలు, 39,832 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు రిటర్నింగ్‌ అధికారులు రేపు(సోమవారం) ఎన్నికల నోటీసులు జారీ చేయనున్నారు. దీంతో తొలి విడత నామినేషన్లు ప్రారంభం కానుంది. తర్వాత రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో ఈ నెల 9 వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.10న సాయంత్రం 5 వరకు నామినేషన్ల పరిశీలించనున్నారు. ఆ తర్వాత అర్హులైన అభ్యర్థుల జాబితాలను ప్రకటించనున్నారు.11న సాయంత్రం 5వరకు నామినేషన్లపై అప్పీళ్లను...
ప్రేమించి పెళ్ళి చేసుకొని ఏకగ్రీవ సర్పంచ్ కాబోతున్నది దేేనికైనా అదృష్టం ఉండాలి. తినే మెతుకుపైన కూడా రాసి పెట్టి ఉండాలి అని పెద్దలు ఊకనే అనలేదు. ప్రేమను నమ్మి వచ్చిన అమ్మాయికి జాక్ పాట్ దక్కింది. ఏకంగా గ్రామ సర్పంచ్ పీఠం ఎక్కే అదృష్టం వచ్చింది. ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఆ గ్రామం ఎస్టీ సర్పంచ్ రిజర్వ్ అయ్యింది. ఆ గ్రామంలో ఒక్క ఎస్టీ కుటుంబం కూడా లేకపోవడంతో ఆ యువతిని అదృష్టం వరించింది.
మొత్తం మండలాలు 16 మొదటి విడత ( జనవరి 21) ఎన్నికలు జరిగే మండలాలు 1)నర్సంపేట 2)దుగ్గొండి 3)పర్వతగిరి 4)వర్ధన్నపేట 5)సంగెం రెండవ విడత (జనవరి 25) న ఎన్నికలు జరిగే మండలాలు 1) పరకాల 2)నడికూడ 3)శాయంపేట 4నల్లబెల్లి 5)ఖానాపురం 6)రాయపర్తి మూడవ విడత( జనవరి 30) న ఎన్నికలు జరిగే మండలాలు
చేర్యాల మండలం కొమురవెల్లిలో శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం సంధర్భంగా.. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు, పూజారులు.
114 Followers
Follow