Home Authors Posts by MARUPATLA JAYAPAL

MARUPATLA JAYAPAL

959 POSTS 0 COMMENTS
హైదరాబాద్ ప్రతినిధి :- 27న గ్రామాల్లో ఓటర్ల తుది జాబితా -జెడ్పీ సీఈవోలు, డీపీవోలకు ఈసీ ఆదేశం. జిల్లా, మండల పరిషత్ ఎన్నికలకు ఈసీ సమాయత్తమవుతున్నది. మే మొదటి వారంలో ఒక విడుత, రెండోవారంలో రెండు విడుతల్లో ఎన్నికలు నిర్వహించే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న ది. ఏప్రిల్ రెండో వారంలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నది. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లుచేస్తున్నది. పరిషత్ ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే జెడ్పీ సీఈవోలు, డిప్యూటీ సీఈవోలు, డీపీవోలతో...
హైదరాబాద్ ప్రతినిధి :- మహబూబ్‌నగర్ సిట్టింగ్ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి బీజేపీ సీనియర్ నేత రాం మాధవ్‌తో మంగళవారం నాడు భేటీ అయ్యారు. టీఆర్ఎస్ టిక్కెట్టు దక్కని కారణంగా జితేందర్ రెడ్డి టీఆర్ఎస్‌ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. గత ఏడాది డిసెంబర్ 7 వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారిక అభ్యర్థులకు వ్యతిరేకంగా జితేందర్ రెడ్డి పనిచేశారని ఆ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో...
హైదరాబాద్‌ ప్రతినిధి :- నగరంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచి భానుడు నగరంపై నిప్పులు కురిపిస్తున్నాడు. సాధారణం కంటే అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు నగరవాసుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. సోమవారం గరిష్టం - 37.7, కనిష్ఠంగా 24.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  నేడు కూడా సాధారణం కంటే 2-3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నగరంలో నమోదవుతున్నాయి. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలకు చేరడంతో ఉక్కపోత పెరిగింది. పగటి పూట వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పలు...
హైదరాబాద్ ప్రతినిధి:- లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ముందుగా అనుకున్నట్లే సినిమాను ఈ నెల 29న విడుదల చేస్తున్నామని ఆ చిత్ర నిర్మాత రాకేశ్‌రెడ్డి తెలిపారు. సినిమాలో కొన్ని సన్నివేశాలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిచేలా ఉన్నాయని వచ్చిన ఫిర్యాదుపై సినిమాను పరిశీలిచేందుకు మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ (ఎంసీఎంసీ) ముందు హాజరు కావాలని ఈసీ ఆదేశించింది. ఈ మేరకు ఆ చిత్ర నిర్మాత రాకేశ్‌రెడ్డి సోమవారం హాజరయ్యారు. అనంతరం రాకేశ్‌రెడ్డి మీడియాతో...
హైదరాబాద్ ప్రతినిధి:-తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించింది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు… ఈ నెల (మార్చ్) 30వ తేదీ నుంచి మే 31 వరకు ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించారు. జూన్ 1వ తేదీ నుంచి జూనియర్ కాలేజీలు పున:ప్రారంభం కానున్నాయి. ఇక వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. .
వరంగల్ అర్బన్ జిల్లా :- వరంగల్ తూర్పు డిసిపి గా బుధవారం బాధ్యతలు స్వీకరించనున్న నాగరాజు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:: ఎన్నికల బహిష్కరణ కోసం పాల్వంచ మండలం జగన్నాధపురం లో వెలిసిన మావోయిస్టు పోస్టర్లు కరపత్రాలు తీసివేసిన పోలీసులు
హైదరాబాద్ ప్రతినిధి :- తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ఏపీ, తెలంగాణలో కౌంటింగ్ ప్రారంభమైంది. తెలంగాణలో రెండు టీచర్‌, ఒక గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగిన విషయం విదితమే. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత మధ్య ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇవాళ మధ్యాహ్నం లోపు ఫలితాలు వెలువడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాగా.. ఏపీలో...
వరంగల్ అర్బన్ ప్రతినిధి :- ఏప్రిల్ 02 న వరంగల్ మహానగరంలో జరగపోయే రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్ బహిరంగ సభ స్థలిని పరిశీలిస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ,తూర్పు ఎమ్మెల్యే నన్నెపునేని నరేందర్, పశ్చిమ నియోజవర్గ శాసన సభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ , ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ,పార్లమెంట్ అభ్యర్థి పసునూరి దయాకర్,తెరాస పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు .
వరంగల్ బ్యూరో:-వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా.వి.రవీందర్‌ కారు అద్దాలకు బాక్ల్‌ ఫిల్మ్‌ మరియు సైరన్‌ను తోలగించకుంటే మోటార్‌ వెహికల్‌ చట్టాన్ని అనుసరించి జరిమానాను విధించడం జరుగుతుందని తెలియజేస్తూ ఆదివారం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఓ ప్రకటన విడుదల చేసారు. దేశ అత్యుత్తమ న్యాయ స్థానం సుప్రీం కోర్ట్‌ అదేశాలతో పాటు మోటారు వాహనాల చట్టం ప్రకారం అద్దాలకు బ్లాక్‌ ఫిల్మ్‌ వున్న కార్లపై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ఇందులో భాగంగా పోలీస్‌ కమిషనర్‌ సూచనల మేరకు ట్రాఫిక్‌ ఎ.సి.పి...
109 Followers
Follow