హాకీ వరల్డ్‌కప్: క్వార్టర్స్‌కు ఆస్ట్రేలియా, తొలిజట్టుగా చరిత్ర సృష్టించేనా?

0
13

హైదరాబాద్: భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న హాకీ వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా అడుగుపెట్టిన ఆస్ట్రేలియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. పూల్-బీ మ్యాచ్ లో భాగంగా మంగళవారం ఇంగ్లాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 3-0 గోల్స్‌తో ఘనవిజయం నమోదు చేసింది. తాజా విజయంతో ఈ టోర్నీలో క్వార్టర్స్ చేరిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది.

 1. ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: ‘రెండో టెస్టు నుంచి పృథ్వీ షా ఔట్’

ఇప్పటికే వరుసగా రెండు వరల్డ్‌కప్‌లు అందుకున్న ఆస్ట్రేలియా ఈసారి కూడా విజేతగా నిలిస్తే హ్యాట్రిక్ సాధించిన తొలిజట్టుగా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించనుంది. ఆస్ట్రేలియా జట్టులో వెట్టోన్ (47వ), గోవర్స్ (50వ), కోరీ వెయర్(56వ) నిమిషంలో గోల్స్ సాధించారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఢిఫెన్స్ బలంగా ఉండటంతో తొలి మూడు క్వార్టర్లు ఆస్ట్రేలియాను గోల్ చేయకుండా నిరోధించింది.

 • చివరి 15 నిమిషాల్లో అద్భుతమైన ఆటతీరుతో

  అయితే, చివరి 15 నిమిషాల్లో అద్భుతమైన ఆటతీరుతో ఆస్ట్రేలియా ఆకట్టుకుంది. తొలుత టామ్ చిరాగ్ అందించిన పాస్‌ను వెట్టోన్ గోల్‌గా మలచగా.. మరో మూడు నిమిషాల్లోనే సర్కిల్ నుంచి అందించిన పాస్‌ను ఇంగ్లాండ్ గోల్ కీపర్ జార్జ్ పిన్నర్‌ను బోల్తా కొట్టిస్తూ గోవర్స్ రెండో గోల్‌గా మలిచాడు. మ్యాచ్ మరో నాలుగు నిమిషాల్లో ముగుస్తుందనగా వెయర్ గోల్ సాధించి జట్టుకు 3-0 ఆధిక్యం కట్టబెట్టాడు.

 • నేరుగా క్వార్టర్స్‌కు చేరిన ఆస్ట్రేలియా

  దీంతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించి నేరుగా క్వార్టర్స్ చేరింది. టోర్నీలో తొలిమ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడిన ఆస్ట్రేలియా జట్టు 2-1 గోల్స్‌తో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరోవైపు చైనాతో జరిగిన తొలిమ్యాచ్‌ను 2-2తో డ్రా చేసుకున్న ఇంగ్లాండ్ జట్టు.. రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడింది. 

   రెండు పాయింట్లతో చైనా రెండోస్థానంలో

  రెండు పాయింట్లతో చైనా రెండోస్థానంలో

  దీంతో రెండు పాయింట్లతో చైనా రెండోస్థానంలో కొనసాగుతుండగా, ఇంగ్లాండ్, ఐర్లాండ్ చెరో పాయింట్ సాధించాయి. చివరిలీగ్‌‌లో డిసెంబర్ 7వ తేదీన చైనాతో ఆస్ట్రేలియా తలపడనుండగా, ఇంగ్లాండ్ జట్టు ఐర్లాండ్‌తో తలపడనుంది.

   హాకీ వరల్డ్ కప్‌లో బుధవారం మ్యాచ్‌లుహాకీ వరల్డ్ కప్‌లో బుధవారం మ్యాచ్‌లు

  జర్మనీ vs హాలెండ్, సాయంత్రం 5 గంటలకు
  మలేషియా vs పాకిస్థాన్, సాయంత్రం 7 గంటలకు
  స్టార్‌స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here