దేశంలో నిరుద్యోగ సమస్య గణనీయంగా పెరిగిపోతోంది. తాజా నివేదిక ప్రకారం గత 45 ఏళ్ళలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగ సమస్య ఉందని వెల్లడిస్తుంది. అయితే తాజాగా స్వీపర్ ఉద్యోగాలకు నాలుగు వేల మంది గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకున్న సంఘటన అందరినీ విస్మయ పరుస్తోంది. వారిలో ఎక్కువగా బీటెక్, ఎంటెక్ చేసిని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కూడా ఉన్నారట. ఈ ఉదాంతం తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్ర అసెంబ్లీ సెక్రటేరియట్‌లో 14 స్వీపర్లు, శానిటరీ వర్కర్ల నియామాకానికి ఉద్యోగ ప్రకటన వెలువడింది. కాగా ఎంటెక్‌, బీటెక్‌, ఎంబీఏ, పోస్ట్‌ గ్రాడ్యూయేషన్‌, డిప్లొమా చదివిన పట్టభద్రులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు.

Telugu News 4600 Engineers MBA Graduates Apply For 14 Sweeper Jobs in Tamil Nadu Assembly..

అసలు ఈ ఉద్యోగానికి 18 ఏళ్ళ వయసు ఉండి, ఆరోగ్యంగా ఉంటే చాలు ఎలాంటి విద్యాహర్హత అవసరం లేదు. ఈ స్వీపర్ పోస్టులకు మొత్తం 4,607 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను పరిశీలించిన అధికారులు 3,930 మంది అభ్యర్ధులకు ఇంటర్వూ కోరకు కాల్ లెటర్లను పంపించారు. 14 పోస్టుల్లో 10 స్వీపర్ పోస్టులు, 4 శానిటరీ వర్కర్ పోస్టులు ఉన్నాయని, ఎంపికైన అభ్యర్ధులకు నెలకు జీతం రూ.15,700 నుంచి రూ.50,000 వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. గతంలో ఉత్తరప్రదేశ్‌లో 62 ప్యూన్‌ పోస్టుల కోసం 93వేల మంది దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే ముంబయిలో 13 వెయిటర్‌ పోస్టులకు 7వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.