నూతన సంవత్సర వేడుల సందర్బంగా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు వందకుపైగా డ్రంక్‌ డ్రైవ్‌ టీంలు విధులు నిర్వహిస్తారని వరంగల్‌ పోలీస్‌ కమీషనర్‌ నగర ప్రజలకు సూచించారు. పోలీస్‌ కమీషనరేట్‌ పరిధిలో ఈ నెల 31వ తేది ఆర్థ్రరాత్రి నిర్వహించుకునే నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో వుంచుకోని పోలీస్‌ కమీషనర్‌ ప్రకటన చేస్తూ నూతన సంవత్సర వేడుకలు ప్రతి ఇంట ఆనందోత్సవాల నడుమ నిర్వహించుకోవడంతో పాటు, జిరో యాక్సిడెంట్‌ డేకై వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో వాహనదారులు క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకుగాను ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందని. ముఖ్యంగా గత అనుభవాల దృష్టా యువత మద్యం సేవించి నిర్లక్ష్య ధోరణితో వాహనాలను అతివేగంగా నడిపి రోడ్డు ప్రమాదాలకు గురికావడంతో పాటు కోన్ని సందర్బాల్లో వాహనదారులతో పాటు సాధరణ ప్రజలు తీవ్ర గాయాలకు గురై ఆకాలంగా మరణిస్తున్నారు. ఇలాంటి రోడ్డు ప్రమాదాలను నియంత్రణకై కమీషనరేట్‌ పరిధిలో నూతన సంవత్సర వేడుకల సందర్బంగా నగరంలో ముమ్మరంగా పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు .