👉ప్రభుత్వ ఉద్యోగుల అంతరాష్ట్ర బదిలీల గడువును ప్రభుత్వం పొడిగించింది ఈ ఏడాది జూన్ నెలాఖరుకు వరకు గడువు పొడిగిస్తూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి అంతర్రాష్ట్ర బదిలీల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే గడువు పొడగింపు వర్తించనుంది జూన్ నెలాఖరు వరకు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు నిర్ణయం తీసుకున్నారు