సహకరించిన ప్రతీ ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఙతలు

-తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

19వ డివిజన్ కార్పోరేటర్ గా 2016 లో నన్నపునేని నరేందర్ గారు ఎన్నికై అనంతరం వరంగల్ మేయర్ గా నియమితులయ్యారు.డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో నన్నపునేని నరేందర్ గారు తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాదించారు.దీంతో మేయర్ పదవికి ,19వ డివిజన్ కార్పోరేటర్ పదవికి రాజీనామా చేసారు.కాలీ అయిన 19వ డివిజన్ కార్పోరేటర్ స్థానానికి ఉప ఎన్నిక ప్రకటన విడుదలై 15మంది నామినేషన్లు దాఖలు చేసారు.టీఆర్ ఎస్ అభ్యర్దిగా దిడ్డి నాగరాజు బరిలో నిలిచారు.ఈ రోజు నామినేషన్ల ఉపసంహరణ సందర్బంగా నియోజకవర్గ అభివృద్దే ప్రదాన ఎజెండా అంటూ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో అభ్యర్దులందరు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.దీంతో టీఆర్ఎస్ అభ్యర్ది దిడ్డి నాగరాజు ఎన్నిక ఏకగ్రీవమైంది.ఈ సందర్బంగా వారు మిఠాయిలు తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.నాగరాజు ఏకగ్రీవంతో జై తెలంగాణా నినాదాలు మారుమోగాయి..నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద ఏకగ్రీవాన్ని దృవీకరించి ఎమ్మెల్యే నరేందర్ గారి సమక్షంలో దిడ్డినాగరాజుకు ఎన్నికల అధికారి సర్టిఫికేట్ అందజేసారు.ఈ సందర్బంగా నాగరాజు ఎమ్మెల్యే నరేందర్ గారికి దన్యవాదాలు తెలిపారు.

అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారు మాట్లాడుతూ కార్పోరేషన్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ ఏకగ్రీవం కాలేదని ,నా రాజీనామాతో కాలీ అయిన 19వ డివిజన్ ఎన్నిక ఏకగ్రీవం అవడం సంతోషకరమని అన్నారు.కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ,కేటీ.రామారావు గారి నాయకత్వంలో ఈ రోజు వరంగల్ 19వ డివిజన్ ఉప ఎన్నికలో బాగంగా మా అభ్యర్ది సోదరుడు దిడ్డి నాగరాజు ఏకగ్రీవానికి తమ అభ్యర్దిత్వాన్ని విరమించుకుని సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఙతలు తెలిపారు..ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన కేసీఆర్ గారికి,కేటీఆర్ గారికి దన్యవాదాలని,కార్పోరేటర్ గా దిడ్డి నాగరాజు విజయవంతం అవ్వాలని,తనకు మంచి భవిష్యత్ ఉందని ఇది అతనికి చక్కని అవకాశమని అన్నారు.ఈ ఏకగ్రీవానికి సహకరించిన ముఖ్య నాయకులు,డివిజన్ నాయకులు,కార్యకర్తలు,ప్రజలకు ,మీడియా మిత్రులకు ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలని ,రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మీ సహకారంతో అన్ని నియోజకవర్గాల కంటే దీటుగా మెజారిటి సాదిస్తామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సొంత గూటికి పగడాల సతీష్

ఇటివల ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రేస్ లో చేరిన పగడాల సతీష్ ఈ రోజు తన నామినేషన్ ని ఉపసంహరించుకుని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.ఈ మేరకు ఎమ్మెల్యే నరేందర్ అతన్ని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అతనిపాటు పలువురు టీఆర్ఎస్ లో చేరారు.