హైదరాబాద్ ప్రతినిధి:- కోస్టల్ బ్యాంకు డైరెక్టర్  వ్యాపారవేత్త చిగురుపాటి జయరాంను హత్యచేసిన ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి నేర చరిత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తవ్వేకొద్దీ ఇతని లీలలు నేరచరిత్రకు సంబంధించిన విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. రాకేష్ రెడ్డి జూబ్లీహిల్స్‌లో అత్యంత విలాసమవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక్కడ నుంచి సెటిల్మెంట్స్ చేసేవాడని సమాచారం. గతంలోనే రాకేష్ రెడ్డిపై హైదరాబాద్‌లో పలుకేసు కేసులు నమోదు అయినట్లు పోలీసులు గుర్తిం చారు. 2015లో కూకట్ పల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఎక్స్‌టార్షన్ కేసు నమోదు అయినట్లు దృవీ కరించారు. కూకట్ పల్లిలోని ఓ వ్యాపారిని 60 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది బాధితుడి ఫిర్యాదు మేరకు రాకేష్ రెడ్డి పోలీసులు అరెస్ట్ చేసిన అతని దగ్గరి నుంచి 30 లక్షలు రికవరీ చేశారు పోలీసులు అటు హైటెక్ వ్యబిచారంలో కూడా రాకేష్ రెడ్డి హస్తం ఉన్నట్లు భావిస్తున్నారు పోలీసులు. రాకేష్ కు చాలా మంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అనేక సార్లు సినీ ప్రరిశ్రమలోని యువ తులతో వ్యభిచారం చేయించేవారని ఒకసారి పోలీసులకు కూడా పట్టుబడినట్లు సమా చారం.మరో వైపు రాజకీయ నాయకుల పేర్లు వాడుకోని చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేసినట్లు రాకేష్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. 2018 ఎన్నికల సందర్భంగా ఓ పార్టీకి చెందిన డబ్బులను తరలిస్తూ పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం. తనకున్న పలుకుబడితో ఆకేసు నుంచి బయటపడ్డాడని తెలుస్తోంది. అటు హైదరాబాద్‌లో కొన్ని భూవివాదాలు అక్రమ రిజిస్టేషన్లు చేయించడంలో రాకేష్ రెడ్డి సిద్దహస్తుడు అని తెలు స్తోంది. స్టాంప్స్ అండ్ రిజిస్టేషన్ శాఖలో కొంత మంది ఉన్నతాధికారులకు యువతులను వలవేసి తనదారికి తెచ్చుకున్నాడని  దీంతో భూముల కొనుగోలు రిజిస్టేషన్లు ఈజీగా జరిగేవని తెలుస్తోంది.అటు తాజాగా ఆర్ధిక లావాదేవిల విషయంలోనే వ్యాపారవేత్త చిగు రుపాటి జయరాంను హత్య చేశాడు రాకేష్ రెడ్డి.. ఈవిషయాన్ని పోలీసుల విచారణలో కూడా రాకేష్ ఒప్పుకున్నారు.