త్వరలో పది కిలోమీటర్ల మార్గం అందుబాటులోకి

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అమీర్‌పేట-హైటెక్‌సిటీ మెట్రోమార్గం త్వరలో అందుబాటులోకి రానున్నది. హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఈ మార్గంలో రైళ్లు నడిపేందుకు మార్గం సుగమమైంది. అమీర్‌పేట-హైటెక్‌సిటీ మార్గంలో కమిషనర్ ఆఫ్ మెట్రోరైల్ సేఫ్టీ (సీఎంఆర్‌ఎస్) రైళ్లు నడుపడానికి అనుమతిచ్చింది.మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ వరకు గల పది కిలోమీటర్ల మార్గాన్ని గత ఏడాది నవంబర్‌లోనే సిద్ధంచేశారు. నవంబర్ 27న ట్రయల్న్ ప్రారంభించారు. సుమారు నాలుగు నెలలుగా ట్రయల్న్ కొనసాగుతున్నది. సీఎంఆర్‌ఎస్ బృందం ఫిబ్రవరిలో తనిఖీలు చేపట్టింది.
తాజాగా అనుమతులు ఇచ్చింది. దీంతో ఈ మార్గం త్వరలోనే అందుబాటులోకి రానున్నది. అమీర్‌పేట-హైటెక్‌సిటీ మార్గంలో మెట్రోరైలు కోసం ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. మాదాపూర్, హైటెక్‌సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోని సాఫ్ట్‌వేర్ కంపెనీలు, ఇతర సంస్థల్లో పెద్ద ఎత్తున ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. వీరు రోజూ తమ కార్యాలయాలకు వచ్చివెళ్లేందుకు ట్రాఫిక్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అమీర్‌పేట్-హైటెక్‌సిటీ మార్గం లో రైళ్లు ప్రారంభమైతే ప్రజలకు వేగమైన, సౌకర్యవంతమైన ప్రయా ణం అందుబాటులోకి వస్తుంది. హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టులో ఇప్పటికే మియాపూర్ -ఎల్బీనగర్ (29 కి.మీ), నాగోల్-అమీర్‌పేట (17కి.మీ.) మా ర్గం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిం ది. రోజూవేలమంది రాకపోకలు సాగిస్తున్నారు. ఇన్నాళ్లూ పెండిగ్‌లో ఉన్న అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ మార్గం కూడా త్వరలో అందుబాటులోకి రానున్నది. ఎప్పుడు ప్రా రంభిస్తారో త్వరలో ప్రకటించనున్నారు.

ఎనిమిది స్టేషన్లు
ప్రస్తుతం ట్రయల్న్ నిర్వహిస్తున్న అమీర్‌పేట-హైటెక్ సిటీ మార్గంలో మొత్తం ఎనిమిది మెట్రో స్టేషన్లు ఉంటాయి.

అవి
1)మధురానగర్(తరుణి)

2) యూసుఫ్‌గూడ

3) జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్-5

4) జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు

5) పెద్దమ్మ గుడి

6) మాదాపూర్

7) దుర్గం చెరువు

8) హైటెక్‌సిటీ