పెద్దపల్లిజిల్లా ప్రతినిధి:-పెద్దపల్లిజిల్లా సుల్తానాబాద్ పట్టణంలో హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ ను ప్రారంభించిన పెద్దపల్లి జాయింట్ కలెక్టర్ వనజాదేవి. ఈ సందర్భంగా వనజాదేవి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అన్ని రకాల బ్యాంక్ సేవలు అందుబాటులో ఉండేలా అధికారులు కూడా కృషి చేయాలన్నారు. గోల్డ్ లోన్, వ్యవసాయ రుణాలు , వాహన రుణం, హౌజింగ్ రుణం ఏదైనా ఈ బ్యాంక్ నుండి పొందవచ్చని అన్నారు .రాబోయే రోజుల్లో బ్యాంకులలో అన్ని రకాల ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రజలు దీనిని దృష్టిలో ఉంచుకుని సేవలు కొనసాగించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బ్యాంక్ క్లస్టర్ ఇమ్రాన్ , బ్యాంక్ మేనేజర్ కుమార్ , తహసీల్దార్ మధుసూదన్ ,బ్యాంక్ సిబ్బంది ,ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు…