వనపర్తి జిల్లా ప్రతినిధి:- వనపర్తిలో రాఘవేంద్రర్ ను హత్య చేసిన సంఘటనలో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశామని వనపర్తి డిఎస్పీ సృజన చెప్పారు. శ్రీకాంత్ రెడ్డి పరారీలో ఉన్నారని తెలిపారు. వనపర్తికి చెందిన 1.అరుణ్ యాదవ్,2.హరీష్ యాదవ్,3.వంశీతేజ,4.అశోక్ కుమార్,5.ఓంకార్ యాదవ్,6.(శ్రీకాంత్ రెడ్డి-పరారీలో ఉన్నారు),7.ప్రేమ్ నాథ్ రెడ్డిని విలేకరుల ముందు హాజరుపరిచారు.పాత కక్షల వల్ల హత్య జరిగిందని డిఎస్పీ తెలిపారు.వనపర్తిలో తల్లిదండ్రులు కూడా పిల్లలపై నిఘా ఉంచాలని, మద్యం,గంజాయికి,చెడు అలవాట్లకు దూరంగా ఉంచాలని కోరారు. వనపర్తి సిఐ సూర్యనాయక్,టౌన్ ఎస్ ఐ నరేందర్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.