26 రాష్ట్రాల్లో 55 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాం.
ఇప్పటికే కొన్ని స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కూడా చేసాం.
గత పార్లమెంట్ లో ప్రజల కోసం శక్తివంతమైన గొంతును వినిపించాం.
వామపక్షాలను గెలిపిస్తే ప్రజలకు అవసరమైన చట్టాల రూపకల్పనలో మా బలం ఉపయోగపడుతుంది.
బీజేపీ, ఎన్డీయే పార్టీలను చిత్తుగా ఓడించాలని సీపీఐ పిలుపునిస్తుంది.
పలు రాష్ట్రాల్లో అక్కడి ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నాం.
కశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరపకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం.
కశ్మీర్ లో పార్లమెంట్ ఎన్నికలు జరపగలిగినప్పుడు, అసెంబ్లీ ఎన్నికలు జరపడానికి ఇబ్బంది ఏంటీ?
ఐదువేల తేడాతో ఓడిపోయిన స్థానాల్లో వివి ప్యాట్లు లెక్కపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.
ప్రతిపక్షాలు పాకిస్థాన్ కి మద్దతు పలుకుతున్నాయని మోదీ ప్రచారం చేస్తున్న అబద్దాలను కండిస్తున్నాం.

చాడ వెంకట్ రెడ్డి ,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి.

తెలంగాణ ఫిరాయింపుల తెలంగాణగా మారింది.
ప్రతిపక్షాలను మానసికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా కేసీఆర్ పెట్టుకున్నారు.
సీపీఐ, సిపిఎంలు కలిసి పోటీ చేస్తామని అనుకున్నాం.
మా రాష్ట్ర కమిటీలతో చర్చించి పూర్తి విషయాలను వెల్లడిస్తాం.