సీయం సొంత జిల్లాలో టిడిపికి షాక్ : కిర‌ణ్ సోద‌రుడి గెలుపు కు చెక్‌..!

92

ఆయనతో పాటు మరో 20మంది నేతలు కూడా టీడీపీకి రాజీనామా చేశారు. పాతిక సంవత్సరాలు టీడీపీకి సేవ చేసి ఎంతో నష్టపోయామని ఇక్బాల్‌ వాపోయారు. 2014లో కిరణ్‌కుమార్‌ రెడ్డి కుటుంబం మీద పోటీచేయాలని తన మీద చంద్రబాబు ఒత్తిడి తీసుకవచ్చారని.. అందుకే పోటీచేశానన్నారు. అయితే ఎన్నికల తరువాత నల్లారి కిషోర్‌కుమార్‌ రెడ్డిని టీడీపీలో చేర్చుకునేటప్పుడు తనకు నామినేటెడ్‌ పదవిని ఇస్తానని చెప్పిన చంద్రబాబు తరువాత పట్టించుకోలేదన్నారు. పైగా కిషోర్‌ కుమార్‌ రెడ్డికి ఇన్‌చార్జీ బాధ్యతలను ఇవ్వడమే కాకుండా.. కార్పోరేషన్‌ పదవిని కూడా ఇచ్చారన్నారు. సీఎంను కలిసి అనేక సార్లు తాను పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పానన్నారు. సీయం తో పాటుగా అన్నివిధాల ఆదుకొంటా మని సీఎం రమేష్‌ కూడా హామీ ఇచ్చారని తెలిపారు. అంతేకాకుండా టీడీపీ అధికారంలోకి వచ్చాక క్యాబినేట్‌ పదవిని ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.. కానీ ఇప్పటివరకు న్యాయం జరగలేదని ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో నారా – న‌ల్లారి కుటుంబాల మ‌ధ్య రాజ‌కీయంగా వైరుధ్యం ఉంది. అయితే, మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి సోద‌రుడు కిషోర్ కుమార్ రెడ్డి టిడిపి లో చేర‌టం తో ఆయ‌న‌కు కిర‌ణ్ కుటుంబానికి రాజ‌కీయంగా పెట్ట‌ని కోట లాంటి పీలేరు బాధ్య‌త‌లు చంద్ర‌బాబు అప్ప‌గించారు. 2014 లో సైతం ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుండి కిషోర్ స‌మైక్యాంధ్ర పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయారు. అక్క‌డ వైసిపి అభ్య‌ర్ధి రామ‌చంద్రా రెడ్డి గెలుపొందారు. ఆ ఎన్నిక‌ల్లో టిడిపి మైనార్టీ ల‌కు ఇచ్చిన సీటు ఇదొక్క‌టే.

ఇక‌, ఇప్పుడు పాతికేళ్లుగా టిడిపి కోసం ప‌ని చేసిన బ‌ల‌మైన మైనార్టీ నేత రాజీనామా తో టిడిపి తో పాటుగా.. కిషోర్ కుమార్ రెడ్డి గెలుపు మీద ప్ర‌భావం ప‌డుతుంద‌ని స్థానిక నేత‌లు విశ్లేషిస్తున్నా రు. అయితే, టిడిపి నేత‌లు ఇక్బాల్ ను స‌ముదాయించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నా.. తన రాజీనామా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని ఆయ‌న స్పష్టం చేస్తున్నారు.

చిత్తూరు జిల్లా పీలేరు నియోజ‌వ‌ర్గం లో టిడిపి కి మాజీ ఇన్‌ఛార్జ్..మైనార్టీ నేత ఇక్బాల్ మ‌హ‌మ్మ‌ద్ రాజీనామా చేసారు.