వరంగల్ రూరల్ జిల్లా :
నర్సంపేట ప్రతినిధి:- తేదీ 12-02-2019 న నర్సంపేట నియోజక వర్గానికి సాగునీరు అందించే ప్రాజెక్టుల పరిశీలన కొరకు హెలికాప్టర్ ద్వారా ‘ఏరియల్ వ్యూ’ చేయనున్న ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి స్మితా సబర్వాల్, OSD. శ్రీధర్ దేశ్ పాండే , ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు…

ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇరిగేషన్ సమీక్ష సమావేశంలో ఉన్నతాధికారులకు ఇచ్చిన ఆదేశాల మేరకు 12-02-2019 (మంగళవారం) రోజున నర్సంపేట నియోజవర్గానికి సాగునీరు అందించే  గోదావరి నదిపై నిర్మిస్తున్న  బృహత్తర ప్రాజెక్టు లైన దేవాదుల ఇంటెక్ వెల్  ప్రధాన బ్యారేజ్ పనులతో పాటు పాకాల రంగయ్య చెరువు ప్రాజెక్టు పంప్ హౌజ్ ను ఏరియల్ వ్యూ (హెలికాప్టర్) ద్వారా మంగళవారం ఉ౹౹. 9. గంటల నుండి సాయంత్రం 4. గంటల వరకు పరిశీలించనున్న  శాసన సభ్యులు  పెద్ది సుదర్శన్ రెడ్డి , ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి, ఇరిగేషన్ శాఖ బాధ్యులు స్మితా సబర్వాల్- I.A.S గారు, & OSD - శ్రీధర్ దేశ్ పాండే.

12 వ తేదీన జరగున్న ఈ యొక్క ఏరియల్ సర్వే కు సంబందించిన అంశాలు ప్రాజెక్టుల పురోగతిని ఉన్నతాధికారులు చీఫ్ ఇంజనీర్ బంగారయ్య & ఇతర అధికారులు నివేదికను ఇవ్వనున్నారు. రేపు అనగా (11-02-2019)న హైదరాబాద్ లో ఈ యొక్క ఏరియల్ వ్యూ కు సంబందించిన ప్రాజెక్టుల నిర్మాణం, పురోగతి మొదలగు అంశాలను సీఎంవో అధికారులతో పాటు ఇంజనీరింగ్ సంబంధిత అధికారులతో సమావేశం ఉంటుంది.