సర్వే సత్యనారాయణ సస్పెండ్ – బిజ్ ఈ న్యూస్

0
265

మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆయనపై వేటు వేసింది. సమీక్షా సమావేశంలో ఏఐసీసీసీ ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శి ఆర్.సీ కుంతియా, పీసీసీ అధ్యక్షుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను సస్పెండ్ చేశారు. టీపీసీసీ చీఫ్‌, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ పై సర్వే సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్‌ అడ్డుకున్నారు. దీంతో ఆయనపై సర్వే మండిపడ్డారు. ఇరువురూ పరస్పరం దూషించుకున్నారు. ఈ నేపథ్యంలో బొల్లు కిషన్‌పైకి వాటర్‌ బాటిల్‌ విసిరిన సర్వే సత్యానారాయణ సమావేశం మధ్యలోనే అలిగి వెళ్లిపోయారు. అధిష్టానం ఆదేశాలతో సర్వే సత్యనారాయణను క్రమశిక్షణా సంఘం సస్పెండ్ చేసింది. కాంగ్రెస్‌ పార్టీలో రౌడీ మూకలున్నాయని సర్వే సత్యనారాయణ విమర్శించారు. అసలు పార్టీలో ఏం జరుగుతోందో రేపు చెప్తానని ఆయన అన్నారు. ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అర్హత లేనివాళ్లకు పదవులిచ్చారని విమర్శించారు. పీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్‌ను తొలగించాల్సిందేనని సర్వే డిమాండ్ చేశారు. ఉత్తమ్‌ను ఇంకా పార్టీ భరించాలా? అని ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here