ఈ రోజు హాసన్ పర్తి మండల పరిధిలోని అన్ని గ్రామాల ముఖ్య నాయకులు, సర్పంచ్ అభ్యర్థుల ఆశావాశులతో వర్థన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా గ్రామాలలో ఎవరికి సర్పంచ్ అభ్యర్థిత్వం ఇవ్వాలని అనే అంశాలపై ఆయా గ్రామాల నాయకులతో చర్చించారు. నియోజకవర్గంలో వీలైనన్ని ఎక్కువ గ్రామాలు ఏకగ్రీవం అయ్యే విధంగా స్థానిక నాయకులు కృషి చేయాలని ఎమ్మెల్యే గారు సూచించారు. పంచాయితీలను ఏకగ్రీవం చేసుకుని గ్రామ అభివృద్దికి పోటీలో ఉన్న అభ్యర్థులు సహకరించాలని పేర్కోరన్నారు. ప్రభుత్వం అందించే 10 లక్షల తోపాటు సీడీఎఫ్ నిధుల నుండి 5లక్షలు కేటాయించనున్నట్లు ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు తెలిపారు.