• లోక్ సభ ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై సమీక్ష
  • ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించాలి
  • ఇన్ స్పెక్టర్లు, ఏసీపీలు డీసీపీలతో సీపీ సమావేశం

సైబరాబాద్ ప్రతినిధి :- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఈరోజు ఇన్ స్పెక్టర్లు, ఏసీపీలు, డీసీపీలతో సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., లోక్ సభ ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సెగ్మెంట్ కో-ఆర్డినేటర్లు గా నియమించిన ఏసీపీలు, ఇన్ స్పెక్టర్ల కు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., మాట్లాడుతూ పోలింగ్ ప్రశాంత వాతవరణంలో జరిగే విధంగా కృషి చేయాలన్నారు. లోక్ సభ ఎన్నికల దృష్ట్యా సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈసారి ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఇన్సిడెంట్ ఫ్రీ ఎలెక్షన్స్ కావాలన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను అనుసరించి ఉల్లంఘనలపై దృష్టి సారించాలన్నారు. హోర్డింగులు, ఫ్లెక్సిల ఏర్పాటుకు సంబంధిత ఆర్ఓ ల నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. చెక్ పోస్టులను ఏర్పాటు చేసి మద్యం, నగదు తరలించకుండా చూడాలన్నారు.
పోలింగ్ స్టేషన్ల లొకేషన్, రూట్స్ బందోబస్తు నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలను తెలిపారు. పోలింగ్ స్టేషన్లకు 200 మీటర్ల లోపు పార్టీ ఆఫీసులను ఉండరాదన్నారు. ఎన్నికల క్యాంపెయినింగ్ లలోఉపయోగించే వాహనాల కోసం రిటర్నింగ్ ఆఫీసర్ ల పర్మిషన్ తీసుకోవాలన్నారు. బెల్ట్ షాపులను మూసివేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, కుర్చీల వంటి కనీస మౌలిక వసతులను కల్పించాలని ఎస్ హెచ్ ఓ లకు సూచించారు. మహిళలు, చిన్నారులు, వికలాంగులు, వృద్ధులు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రం 200 మీటర్ల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, నాలుగురికంటే ఎక్కువ గుమికూడవద్దన్నారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లూ ఎన్నికల నిర్వహణకు ఆటంకం కలిగించే అసాంఘిక శక్తులపై నిఘా ఉంచాలన్నారు. గత ఎన్నికల సమయంలోని నాన్ బెయిలబుల్ ను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఏసీపీలు, డీసీపీలు సరిహద్దు పోలీస్ స్టేషన్ కో- ఆర్డినేషన్ మీటింగ్ లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. రెవెన్యూ సిబ్బంది పోలీసులతో సమన్వయం చేసుకుంటూ పని చేయాలన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎలా ఓటు హక్కును వినియోగించుకోవాలో తెలిపారు.
ఈ కార్యక్రమంలో సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, ఐపీఎస్, శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, మాదాపూర్ డి‌సి‌పి వేంకటేశ్వర రావు, బాలానగర్ డీసీపీ పద్మజ, ఏడీసీపీ ఎస్బీ గౌస్ మొహియుద్దీన్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ మాణిక్ రాజ్, ఏసీపీలు, ఇన్ స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.