సికింద్రాబాద్ ప్రతినిధి:- శ్రీరెడ్డి ఇప్పుడు పరిచయం అక్కర్లేని పేరు. సినిమా పరిశ్రమలో లైంగిక దోపిడీ ఎలా జరుగుతుందో బాహాటంగా చెప్పిన తెలుగమ్మాయి. ఇప్పుడు శ్రీ రెడ్డి మీద ఓ సినిమా తెరకెక్కుతోంది. రెడ్డి డైరీస్ అనే పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. శ్రీరెడ్డి తన పాత్రలో తానే నటిస్తోంది. ఆమెతో పాటు మరికొంతమంది కొత్త వారిని ఈ సినిమాతో పరిచయం చేస్తున్నారు. శ్రీ రెడ్డి జీవితంలో జరిగిన ఘటనలను ఆధారంగా చేసుకుని చిత్తిరై సెల్వన్ కథను, స్క్రీన్‌ప్లేను రూపొందించారు. డాక్టర్ అలాదీన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రంగీలా ఫిల్మ్ హౌస్ రూపొందిస్తోంది. రవిదేవన్ నిర్మాత. చిత్తిరై సెల్వన్ కూడా మరో నిర్మాత. ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తు న్నారు.సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పి శ్రీరెడ్డిని మోసం చేసిన వ్యక్తుల పేర్ల ప్రస్తావన కూడా ఈ చిత్రంలో ఉండనుందట. ఎక్కువ భాగాన్ని అళెప్పీ, గోవాలో చిత్రీకరించారు. శ్రీరెడ్డి తన సొంత అనుభవాలతో పాటు, తన దగ్గరకు వచ్చి చెప్పుకొన్న పలువురి అనుభ వాలను కూడా ఈ కథలో చొప్పించారట.