శ్రీదేవి పాత్ర‌లో ర‌కుల్ ఫిక్స్ అయిన‌ట్టేనా?-బిజ్ ఈ న్యూస్


బిజ్ ఈ న్యూస్ :మాజీ ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత న‌టుడు నంద‌మూరి తార‌క రామారావు జీవిత‌కథ ఆధారంగా `ఎన్టీయార్` సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీయార్ పాత్ర‌లో నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తూ, నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్ర‌స్తుతం షూటింగ్ దశ‌లో ఉంది.
ఈ సినిమాలో ప‌లు కీల‌క పాత్ర‌ల‌కు ప్ర‌ముఖ న‌టుల‌ను తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీయార్ భార్య బ‌స‌వ‌తారకం పాత్ర‌లో విద్యాబాల‌న్‌, అల్లుడు నారా చంద్ర‌బాబు నాయుడి పాత్ర‌లో యంగ్ హీరో రానా న‌టిస్తున్నారు. అతిలోక సుంద‌రి శ్రీదేవి పాత్ర‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌న‌పించ‌నుంద‌ని గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా ఈ సినిమా నిర్మాత‌ల్లో ఒక‌రైన విష్ణు.. ర‌కుల్ ప్రీత్ గురించి క్లారిటీ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఓ జాతీయ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో విష్ణు మాట్లాడుతూ.. `ద‌క్షిణాదిలో, ముఖ్యంగా తెలుగులో మంచి పాపులారిటీ ఉన్న ర‌కుల్‌నే శ్రీదేవి పాత్ర కోసం అనుకున్నాం. శ్ర‌ద్ధ, కంగ‌న‌, సోనాక్షిల‌ను మేం అసలు క‌ల‌వ‌నే లేదు. త్వ‌ర‌లోనే ర‌కుల్ డేట్స్ తీసుకుని షూటింగ్ ప్రారంభిస్తామ‌`ని ఆయ‌న పేర్కొన్న‌ట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *