హైదరాబాద్: శంషాబాద్‌లోగల రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ప్రయాణికుల వద్ద నుంచి అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి ఇద్దరు ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా అధికారులు వారిని తనిఖీ చేయగా రూ. 66 లక్షల 27 వేల విలువైన బంగారు బిస్కెట్లు ఉన్నట్లు కనుగొన్నారు. అనంతరం బంగారాన్ని స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు.