వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా.వి.రవీందర్‌

వరంగల్ బ్యూరో:-  
ఇమ్మిగ్రేషన్‌ విసా ఫారనర్స్‌ రిజిస్ట్రేషన్‌ ట్రాకింగ్‌ వెబ్‌ అప్లికేషన్‌ ద్వారా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో విద్యనభ్యసించు మరియు  నివాసం వుండే విదేశీయుల కోసం సంబందిత యాజమాన్యుల కోసం సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన సదస్సును ప్రారంభించిన వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌. 

నేషనల్‌ ఈ-గవర్నెన్స్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా నూతనంగా రూపోందించిన ఐ.వి.ఎఫ్‌.ఆర్‌.టి (ఇమ్మిగ్రేషన్‌ విసా ఫారనర్స్‌ రిజిస్ట్రేషన్‌ ట్రాకింగ్‌) వెబ్‌ అప్లికేషన్‌లోని ఫారం సి మరియు ఫారం ఎ నమోదు తీరుపై వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ అధ్వర్యంలో విదేశీయులు స్థానికంగా వుండే విధ్యాసంస్థలు, వసతిగృహల యాజమాన్యనికి అవగాహన సదస్సును స్థానిక హన్మకొండలోని వాగ్దేవి కళాశాల సమావేశ ప్రాంగణం శుక్రవారం నిర్వహించారు.

హైదరాబాద్‌కు చెందిన అధికారులు మధుసూదన్‌ రెడ్డి, జాకీర్‌హుస్సేన్‌చే ఏర్పాటు చేసిన ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిధిగా హజరయిన వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ విదేశాల నుండి మన దేశానికి వచ్చే విదేశీయులను గౌరవిండంతో పాటు, వారికి ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా మరియు విదేశీయులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడంతో బాటు, వారికి మెరుగైన సేవలందించేందుకుగాను జాతీయ స్థాయిలో ఈ-గవరేన్స్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా ఐ.వి.ఎఫ్‌.ఆర్‌.టి వెబ్‌ అప్లికేషన్‌ని ప్రవేశ పెట్టబడింది. ఈ వెబ్‌ అప్లికేషన్‌లోని రెండు ముఖ్యమైన ఫారాలైనా ఫారం సి మరియు ఫారం ఎ ను పూర్తి చేయడంలో విధ్యాసంస్థలు, వసతిగృహల యాజమాన్యానికి అవగాహన కల్పించడం కోసం ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని. ఎవరైతే విదేశీయులకు స్థానికంగా వసతి కల్పిస్తునారో సదరు యాజమాన్యం వారు తప్పని సరిగా విదేశీయుల పూర్తి సమాచారాన్ని అనగా వారు భారతదేశానికి రావడంగల కారణాలతో పాటు, వారి వ్యక్తిగత పూర్తి సమాచారాన్ని వెబ్‌ అప్లికేషన్‌లోని ఫారం సి మరియు ఫారం ఎ ను నమోదు చేయాల్సి విధానంతో పాటు అన్‌లైన్‌ నమోదు చేసే పద్దతులను ఈ సదస్సులో తెలియజేయబడుతుందని. ముఖ్యంగా విధ్యా సంస్థలు, వసతిగృహ యాజమాన్యంగా తప్పనిసరిగా ఫారం సి మరియు ఫారం ఎ లు పూర్తి చేయాల్సి వుంటుంది లేని ఎడల వారిపై ఫారనర్స్‌ యాక్ట్‌ను అనుసరించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని. ఈ విధానాన్ని అమలు పర్చడం ద్వారా విదేశీయులకు పూర్తి స్థాయిలో మేరుగైన సేవలందించడంతో పాటు, దేశంలో నివాసం వుంటున్న విధేశీయులకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో వుందడంతో పాటు, విసా గడువు ముగిసిన దేశంలో అక్రమంగా నివాసం వుండే విదేశీయులను గుర్తించేందుకు ఈ రెండు ఫారాల ద్వారా పోందుపర్చిన సమాచారం వినియోగపడుతుందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.

ఈ అవగాహన సదస్సుకు స్పెషల్‌ బ్రాంచ్‌2 ఎ.సి.పి  శ్రీనివాస్‌, హన్మకొండ ఎ.సి.పి శ్రీధర్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఫారనర్స్‌ విభాగం సబ్‌-ఇన్స్‌స్పెక్టర్‌ షేక్‌ అబ్దుల్‌ పాషా, అసిస్టేంట్‌ అనాటిక్‌ అఫీసర్‌ మాషూఖ్‌ పాషా పాల్గోన్నారు.