హైదరాబాద్‌: రహదారులపై నిబంధనలను ఉల్లంఘిస్తూ జరిమానాలను తప్పించుకునేందుకు వాహనాల నంబరు ప్లేట్లను వంచేస్తున్న చోదకులపై పోలీసులు కఠిన వైఖరి అవలంబించాలని నిర్ణయించారు. ఈ వైనాన్ని గమనించిన  పోలీసులు కొద్దినెలలుగా ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి ఇలాంటి వారికి జరిమానా విధిస్తున్నారు. బుధవారం (నేడు) నుంచి కేసు నమోదుతో పాటుగా కోర్టులో అభియోగ పత్రాలు సమర్పించనున్నారు.దీంతో వాహన చోదకులు తప్పనిసరిగా కోర్టులో హాజరుకావాలి. అక్కడ జరిమానా చెల్లించి వాహనాన్ని తీసుకోవాల్సి ఉంటుందని ట్రాఫిక్‌ అధికారులు తెలిపారు.