పెద్దపల్లి జిల్లా ప్రతినిధి :- పెద్దపల్లిజిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో భారత జవాన్లకు మద్దతుగా పాకిస్తాన్ ముష్కర స్థావరం పై భారత్ వైమానిక దాడులు చేయడంపై గ్రామ యువతతో కలసి వాడవాడలా త్రివర్ణ పతాకాన్ని చేతభూని భారత్ మాతకి జై , జై జవాన్ , జై కిసాన్ అంటూ బైక్ ర్యాలీ నిర్వహించిన న్యాయవాది బుర్ర వీరస్వామి గౌడ్ . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్ర మూకలపై పిడుగుల వాన కురిపించిన భారత వాయుసేనకు అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. దాదాపు 300 మందికి పైగా ఉగ్రవాదులను హతం చేసిన భారత వాయుసేనకు మద్దతుగా గ్రామ యూత్ సభ్యులతో కలిసి త్రీవర్ణ పతాకాన్ని చేతబట్టుకొని వాడవాడలా బైక్ ర్యాలీ నిర్వహించం మన సైన్యం ఇలా చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. శతృభూమిలోకి చొచ్చుకొని వెళ్లి మరీ ఇంత పెద్ద మొత్తం హతం చేయడం పట్ల ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడు వాయుసేనకు సెల్యూట్ చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ యూత్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు….