వరంగల్ అర్బన్ ప్రతినిధి:-ఈరోజు హన్మకొండ హంటర్ రోడ్డులోని వేద బాంక్వెట్ హాల్ లో బీజేపీ వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షులు శ్రీ ఎడ్ల అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ చింత సాంబమూర్తి గారు. ఈయొక్క సమావేశంలో మాజీ శాసనసభ్యులు శ్రీ మార్తినేని ధర్మరావు గారు, శ్రీ వన్నల శ్రీరాములు గారు,బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు వంగల సమ్మిరెడ్డి, దొంతి దేవేందర్ రెడ్డి, రావుల కిషన్, పేదగాని సోమయ్య, బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శులు గురుమూర్తి శివ కుమార్, సంగని జగదీశ్వర్, వరంగల్ పార్లమెంట్ కన్వినర్ తాళ్లపల్లి కుమారస్వామి, బీజేపీ నాయకులు కొత్త సారంగారావు, కుసుమ సతీష్, జన్ను మధు,మార్టిన్ లూథర్, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి చింత సాంబమూర్తి గారి కామెంట్స్ :

నిన్న జరిగిన లోక్ సభ ఎన్నికల విషయంలో తీవ్ర అసంతృప్తి వెక్తం చేసిన బీజేపీ నాయకులు.

కెసిఆర్ పీఎం అయితే దేశంలో మద్యo ఏరులై పారుతోంది.

తెరాస పాలనలో లోకసభ ఎన్నికల్లో మద్యం, డబ్బులు ఏరులై ప్రవహించింది.

అధికారులు, పోలీస్ యంత్రంగం ప్రేక్షక పాత్ర పోషించింది.

కెసిఆర్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరం.

మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి వల్లే ఈ ఎన్నికల్లో ఈ అగాధానికి పాల్పడ్డారు తెరాస నాయకులు.

కేంద్రం ప్రభుత్వO నరేద్ర మోడీ ఆధ్వర్యంలో చెప్పటే అన్ని పథకాలు రాష్టంలో అమలయ్యేలా బీజేపీ నాయకులం పోరాడతాం