రంగారెడ్డి: ఎల్ బినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  నాగోల్ ప్రాంతం బండ్లగూడలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ ఢీకొని ఇంజినీరింగ్ విద్యార్థిని నవ్య మృతి చెందింది. నవ్య రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే ఆమె ప్రాణాలు పోయాయి. ఎల్ బి నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.