రోడ్డు ప్రమాదంలో 10 మంది అయ్యప్ప భక్తుల మృతి

రోడ్డు ప్రమాదంలో 10 మంది అయ్యప్ప భక్తుల మృతి
పుదుకొట్టై : తమిళనాడులోని పుదుకొట్టై వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అయ్యప్ప భక్తులతో వెళ్తున్న ఓ వ్యాన్‌ను ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో 10 మంది అయ్యప్ప భక్తులు మృతి చెందారు. శబరిమల ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులంతా తెలంగాణ రాష్ట్రంలోని మెదక్‌ జిల్లా వాసులు.


రోడ్డు ప్రమాదంలో 10 మంది అయ్యప్ప భక్తుల మృతి
ఘటనాస్థలిలో ఏడుగురు మృతి చెందగా.. పుదికొట్టై ప్రభుత్వ ఆస్పత్రిలో ముగ్గరు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్‌లో 16 మంది అయ్యప్ప భక్తులు ఉన్నట్లు సమాచారం. మృతులను మెదక్‌ జిల్లా నర్పాపూర్‌ మండలం హాజీపూర్‌కు చెందిన అయ్యప్పభక్తులుగా గుర్తించారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.