హైదరాబాద్ ప్రతినిధి :- వైఎస్‌ వివేకానంద రెడ్డి మృతి దిగ్భ్రాంతి కలిగించిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. వివేకా మృతిపై అనుమానాలు ఉన్నాయన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్‌కు చెందిన యాగా కంపెనీకి ఇచ్చిన భూమిని.. కేసీఆర్‌ ప్రభుత్వం ఎందుకు వెనక్కి తీసుకోలేదని ప్రశ్నించారు.
ఈ విషయంపై సీబీఐ ఎందుకు మౌనంగా ఉందని నిలదీశారు. రేవంత్‌రెడ్డికి ఒక నీతి.. జగన్‌కు ఒక నీతా? అంటూ వీహెచ్‌ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని కేసీఆర్‌ చూస్తున్నారని, నరేంద్రమోదీకి.. జగన్‌ అవినీతిపరుడిగా కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులు వ్యభిచారం కంటే హీనమని వీహెచ్‌ వ్యాఖ్యానించారు.