రేపు అసెంబ్లీలో ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేయడానికి , ముందు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 17.1.20 19 రోజున గురువారం ఉదయం 11 గంటలకు. గన్ పార్కులో అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తారు. కొత్తగా కొలువుదీరిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రితో కలిసి నివాళులు అర్పిస్తారు. అనంతరం 11:05 నిమిషాల నుంచి అసెంబ్లీలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అదేరోజు అసెంబ్లీలో సభ్యుల ప్రమాణ స్వీకారం స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ పదవులకు నామినేషన్ కార్యక్రమాలు ఉంటాయి.