నర్సంపేట బిజ్ ఈ న్యూస్ ప్రతినిధి :-సాగునీటి రంగంలో న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గం న‌వ చ‌రిత్ర‌ను లిఖించేందుకు రంగం సిద్ధ‌మైంది. ముఖ్య‌మంత్రివ‌ర్యులు కేసీఆర్ సంక‌ల్పం, స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి చొర‌వ‌తో త్వ‌ర‌లోనే న‌ర్సంపేట‌కు గోదావ‌రి జ‌లాలు రానున్నాయి. పాకాల, రంగాయ చెరువుల‌కు మ‌హ‌ర్ద‌శ ప‌ట్ట‌నుంది. ప్రాజెక్టులు గోదావ‌రి జ‌లాల‌ను త‌ర‌లించేందుకు యుద్ద‌ప్రాతిప‌దిక‌న ప‌నులు జ‌రుగుతున్నాయి. ప‌నుల‌ను వేగ‌వంతం చేసి ప్రాజెక్టుల ట్ర‌య‌ల్ ఏర్పాటు కోసం ఇటీవ‌ల హైద‌రాబాద్ లో దేవాదుల శాఖ అధికారుల‌తో సాగునీటి ప్రాజెక్టుల పురోగ‌తిపై సీఎం కేసీఆర్ స‌మీక్షించారు. ఇందులో భాగంగా దేవాదుల ఇన్ టెక్, పాకాల, రంగాయ చెరువుల ప్రాజెక్టు ప‌నుల‌ను ప‌రిశీలించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. సీఎంవో ప్ర‌త్యేకాధికారి స్మిత స‌బ‌ర్వాల్, ఓఎస్డీ శ్రీధ‌ర్ దేశ్ పాండే, దేవాదుల చీఫ్ ఇంజ‌నీర్ బంగార‌య్య న‌ర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి లు క‌లిసి హెలికాప్ట‌ర్ లో ఏరియ‌ల్ వ్యూ ద్వారా ప‌రిశీలించారు.