హైదరాబాద్ ప్రతినిధి:- అన్నదాన సత్రం నిర్మించడం కోసం హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లో పలు స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాజు వెగెస్నా (Raju Vegesna) ఫౌండేషన్ సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు రూ.10 కోట్ల విరాళం అందించారు. ఫౌండేషన్ అధ్యక్షుడు అనంత కోటి రాజు, కార్యదర్శి ఆనందర రాజుల ఆధ్వర్యంలో యాదాద్రిలో ముఖ్యమంత్రిని కలుసుకున్న సభ్యులు చెక్కు రూపంలో విరాళం అందించారు. అన్నదాన సత్రం నిర్మాణానికి ఇంతకంటే ఎక్కువ వ్యయం అయినా భరిస్తామని వారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. యాదాద్రిలో సత్రాలు, గెస్టు హౌజులు నిర్మించడానికి చాలా మంది దాతలు ముందుకు వస్తున్నారని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పటికి 43 మంది దాతలు తలా రూ.2 కోట్ల ఇవ్వడానికి ముందుకొచ్చారన్నారు. వారందరికీ సిఎం ధన్యవాదాలు తెలిపారు.