అమరావతి ప్రతినిధి :ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌, వైసీపీ అధినేత జగన్‌ కలిసి తనను ఓడిస్తామంటున్నారని, తమ జోలికి వస్తే ఊరుకునేది లేదని ఖబడ్దార్‌ అంటూ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ‘‘దొంగాటలు వద్దు.. ధైర్యంగా రండి.. మీరేంటో… మేమేంటో తేల్చుకుందాం. మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటాం. కోడికత్తిని పెద్ద ఇష్యూ చేశారు. ఐటీ దాడులకు మేం భయపడం. 8 లక్షల ఓట్లను తొలగించడానికి కుట్ర చేశారు. బతికి ఉన్న వాళ్ల ఓట్లను కూడా తొలగిస్తున్నారు. ఓట్లను తొలగించడానికి ప్రశాంత్ కిషోర్ ఎవరు? నీ ఆటలు ఇక్కడ సాగవు. ఇది బీహార్‌ కాదు. సైబర్‌ క్రైమ్ చేసే వాళ్లను వదిలిపెట్టం. కోర్టుకీడుస్తాం. ఓటు తీసేసినంత సలువుగా ఆస్తులు కూడా కొట్టేస్తారు’’ అని చంద్రబాబు చెప్పారు.

జగన్‌ గెలిస్తే నీళ్లు కూడా రావని, మనం నీళ్లు ఇస్తే.. జగన్‌ కన్నీళ్లు మిగుల్చుతాడని చంద్రబాబు దుయ్యబట్టారు. మోదీ, జగన్‌, కేసీఆర్‌ కలిసినా ఏపీని ఏం చేయలేరన్నారు. కులాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కులం, మతం చూసి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని చంద్రబాబు వివరించారు.