జయశంకర్ భూపాలపల్లి: మేడారం సమ్మక్క సారక్క మినీ జాతర తేదీలు ఖరారయ్యాయి. సమ్మక్క సారలమ్మ పూజారులు ఈ తేదీలను ఖరారు చేశారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 20 నుంచి 23 వరకు జాతర జరుగుతుందని పూజారులు తెలిపారు. నిజానికి మేడారం జాతర సంవత్సరం తప్పించి మరో సంవత్సరం జరుగుతుంది. జాతర లేని సంవత్సరంలో మినీ జాతరను జరపడం సంప్రదాయం. అందుకే.. మినీ జాతరకు కూడా తేదీలను ఖరారు చేసి ఉత్సవాలను జరపడం ఆనవాయితీగా వ‌స్తోంది