ధర్మసాగర్ ప్రతినిధి:- ధర్మసాగర్ మండలంలోని కారుణపురం గ్రామంలో ఫాదర్ కొలొంబో గారి జన్మదిన సందర్భంగా ఫాదర్ కొలొంబో స్టడీ సెంటర్ ఆధ్వర్యంలో జరిగిన జన్మ దిన వేడుకలకు ముఖ్య అతిధిగా విచ్చేసి ఫాదర్ కొలొంబో గారి విగ్రహానికి పూలమాల వేసి, కేక్ కట్ చేసిన తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డా టి రాజయ్య ఎమ్మెల్యే గారు
**అనంతరం మాట్లాడుతు ఇటలీ నుండి భారత్ దేశానికి వచ్చి అనేక పేద ప్రజలను ఆదుకున్న పెదలపెన్నిది, ఫాదర్ కొలొంబో గారు.
** ఫాదర్ కొలొంబో గారు మత బోధకుడు మాత్రమే కాదు,నిరుపేదలకు అండగా నిలిచి,అనేకుల పేద విద్యార్థులకు పాఠశాలలు, కళాశాలలు,కట్టించి విద్య దానం చేసిన విద్య ప్రదాత.
** మహిళలకు చెతి వృత్తుల పని కల్పిస్తూ అనేక మంది మహిళలకు జీవిత ఉపాధి కల్పించిన మహా గొప్ప మనసున్న మనిషి.
** కుష్టు రోగులకు అండగా నిలిచి వారికి ఆరోగ్యాన్ని అందించిన వైద్య దాత.
** ఈ లాంటి మహా గొప్ప గురువు మన మధ్యలో లేకపోవడం భాదే.కానీ వారు చేసిన మంచి క్రియలు మన మధ్యలో ఉంచిన నిత్యం గుర్తుండే విదంగా వదిలి వెళ్ళిన శ్రమ దాత.
** ఈ లాంటి గొప్ప వ్యక్తి జీవితం అందరికి ఆదర్శం కావాలి.
** వీరి జన్మదినం ఈ రోజు జరుపు కోవడం మనందరి అదృష్టం.ముక్యంగా నా అదృష్టంగా భావిస్తున్నాను.ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి వారే కారణం.వీరు లేని లోటు ఎవ్వరు తీర్చ లేనిదని తెలిజేసినారు.
ఈ కార్యక్రమంలో ఫాదర్ సుధాకర్ గారు,శ్రీ సోమి రెడ్డి మండల సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు,శ్రీ బి వీరన్న గారు,శ్రీ అనిల్ సర్పంచ్ గారు,శ్రీమతి శిఖ వసంత రవి ఎంపీటీసీ గారు,శ్రీ చాడ కుమార్ గారు,శ్రీ ఆర్ యాదగిరి మాజీ ఎంపీపీ గారు,శ్రీ కమలేష్ గారు,శ్రీ మహేందర్ రెడ్డి గారు,శ్రీ రవన్న మాజీ సర్పంచ్ గారు, మహిళలు,తదితరులు పాల్గొన్నారు.