వరంగల్ ప్రతినిధి:తెలంగాణలో ఒంటిపూట బడుల తేదీలు ఖరారు మార్చి 15 నుంచి ఏప్రిల్ 12 దాకా అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు ఉదయం 8 గంటలకే ప్రారంభంకానున్నాయి. మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. తెలంగాణలోని ఒంటిపూట బడుల తేదీలను పాఠశాల విద్యాశాఖ గురువారం (మార్చి 7) ప్రకటించింది. ఈ మేరకు మార్చి 15 నుంచి ఏప్రిల్ 12 వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒంటిపూటే తరగతులు నిర్వహించాలని అధికారిక ప్రకటన విడుదల చేసింది. వేసవికాలం ప్రారంభమవడంతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో మార్చి 15 నుంచి ఏప్రిల్ 12 దాకా తెలంగాణలోని అన్ని పాఠశాలలు ఉదయం 8 గంటలకే ప్రారంభంకానున్నాయి. మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. గతేడాది కూడా మార్చి 15 నుంచే ఒంటిపూట బడులు తరగతులు పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒంటిపూట బడుల నిబంధనలు ఎవరూ పాటించక పోయినా.. చర్యలు తప్పవని, ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలలపై ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా గట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గతేడాది టైమ్ టేబుల్ ఇలా ఉంది..

పీరియడ్ సమయం
మొదటి గంట ఉ. 7.45 గం.
ప్రార్థన ఉ. 7.50 – ఉ. 8.00 గం.
మొదటి పీరియడ్ ఉ. 8.00 – ఉ. 8.40 గం.
రెండో పీరియడ్ ఉ. 8.40 – ఉ. 9.20 గం.
మూడో పీరియడ్ ఉ. 9.20 – ఉ. 10.00 గం.
విరామం ఉ.10.00 గం – ఉ.10.20 గం.
నాలుగో పీరియడ్ ఉ.10.20 గం – ఉ.11.00 గం.
ఐదో పీరియడ్ ఉ.11.00 గం – ఉ.11.40 గం.
ఆరో పీరియడ్ ఉ.11.40 గం – ఉ.12.30 గం.
మధ్యాహ్న భోజనం మధ్యాహ్నం 12.30 గంటలకు