అభినందించిన వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా.వి.రవీందర్‌

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని వివిధ షాపులకు సరఫరాకు సిద్దంగా వున్న ప్రభుత్వ నిషేధిత పోగాకు ఉత్పతుల నిల్వలపై వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం దాడులను నిర్వహించారు. ఈ దాడుల్లో  5గురు గుట్కా వ్యాపారస్థులను అరెస్టు చేయడంతో  పాటు 16లక్షల రూపాయల విలువగల గుట్కా 40 బ్యాగులు. 72వేల నగదుతో పాటు, గుట్కా బ్యాగులను తరలించేందుకు వినియోగించే రెండు కార్లతో పాటు, ఒక బోలేరో వాహనాన్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

పోలీసులు అరెస్టు వారిలో నర్మెట్ల మండలం, బోతేలబర్రే గ్రామానికి చెందిన సిద్ది రాజు, బచ్చన్నపేట మండలం, తమ్మడపల్లి గ్రామస్తుడు ముడుపు రాజుతో పాటు, హెద్రాబాద్‌ ప్రాంతానికి చెందిన బోద్దుల శ్రీనివాస్‌, లోరేల్‌, మాలి లక్ష్మణ్‌ వున్నారు

అరెస్టు సంబంధించిన  వివరాలను వరంగల్  పోలీస్  కమిషనర్  వెల్లడిస్తూ జనగాం జిల్లా నర్మెట్ట మండలం నుండి వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో వివిధ ప్రాంతాలకు నిషేధిత గుట్కా, అంబర్‌ ప్యాకేట్లను సరఫరా జరుగుతున్నట్లుగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందడంతో, టాస్క్‌ఫోర్స్‌ ఏ.సి.పి చక్రవర్తి అదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్‌ ఇన్స్‌స్పెక్టర్‌ రమేష్‌కుమార్‌ అధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది నర్మెట్ట మండలం, బోతేలబర్రే గ్రామంలోని సిద్దం రాజు ఇంటిపై దాడులు నిర్వహించడంతో రవాణాకు సిద్దంగా వున్న గుట్కాల ప్యాకేట్ల గోదాములో నిల్వచేసి వున్న గుట్కా బ్యాగులను పోలీసుల సిద్దం రాజు విచారించడంతో  హైద్రరాబాద్‌ ప్రాంతానికి చెందిన రాజు, శ్రీనివాస్‌, లోరేల్‌, లక్ష్మణ్‌తో కల్సి తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనతో నిందితులు కర్నాటక రాష్ట్రం బీదర్‌ ప్రాంతంలో గుట్కా మరియు అంబర్‌ తయారి కేంద్రాల నుండి కోనుగోళ్ళు చేసి, వాటిని రెండు కార్లు, బోలేరో వాహనం ద్వారా రాత్రి సమయాల్లో నర్మెట్ట  గ్రామానికి తరలించడం జరుగుతుందని ప్రధాన నిందితుడు సిద్దిరాజు అంగీకరించాడు.  ఈ రోజు తెల్లవారుజామున నిందితులు నలురుగు బీదర్‌ నుండి గుట్కా బ్యాగులను మూడు వాహనాల్లో తరలిస్తున్నట్లుగా నిందితుడు ఇచ్చిన సమాచారంతో టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు నర్మెట్ల మండల శివారు ప్రాంతంలో తనీఖీలు నిర్వహిస్తున్న సమయంలో గుట్కా బ్యాగులను తరలిస్తున్న వాహనాలను గుర్తించి నిందితులను అరెస్టు చేసి గుట్కా బ్యాగులను స్వాధీనం చేసుకోవడం జరిగింది.

రాబోవు రోజుల్లో వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో గట్కా, మట్కా, జూదం, వ్యభిచారం లాంటి కార్యకలపాలను నిర్వహించేవారిని కఠినంగా అణివేయాలని టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది సూచించడంతో పాటు పోలీస్‌ కమిషనర్‌ అధికారులు సిబ్బందిని అభినందిచారు. పోలీస్‌ కమిషనర్‌ అభినందించినవారిలో,ఏ.సి.పి చక్రవర్తి, ఇన్స్‌స్పెక్టర్‌ రమేష్‌కుమార్‌తో పాటు సిబ్బంది వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌ యాదవ్‌, క్రాంతి, శ్రీను,ఆలీ, వెంకన్నలు వున్నారు.