• బ్లాస్టింగ్ లకు అనుమతులు తప్పనిసరి
  • నేడు 48వ నేషనల్ సేఫ్టీ వీక్
  • హాజరైన అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన ఒరికా,
  • హైదరాబాద్ కు చెందిన ‘సిబీ మైనింగ్ కంపెనీ

సైబరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఈరోజు 48వ జాతీయ భద్రతా వారోత్సవాల్లో భాగంగా సైబరాబాద్ పోలీసులు మరియు అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన ఒరికా, హైదరాబాద్ కు చెందిన ‘సిబీ మైనింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ’లు సంయుక్తంగా ‘సురక్షితంగా బ్లాస్టింగ్ లు చేయడానికి అవసరమైన నూతన సాంకేతిక పరిజ్ఞానం, కంట్రోల్డ్ బ్లాస్టింగ్’ అనే అంశాలపైనా వివిధ మైనింగ్ అండ్ బ్లాస్టింగ్ కంపెనీల ఎండీలు, సీఈఓలు, బిల్డర్లు, కాంట్రాక్టర్లతో సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్లాస్టింగ్ సమయంలో తీసుకోవాల్సిన భద్రతా అంశాలపై చర్చించారు.
సైబరాబాద్ సీపీ మాట్లాడుతూ హైదరాబాద్ సిటీ రాళ్లపై నిర్మితమైంది. హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇందులో భాగంగా వేగంగా వివిధ కట్టడాల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బ్లాస్టింగ్ లు జరిగే సమయంలో వివిధ కంప్లెంట్లు వస్తున్నాయి. దీనిలో భాగంగా ప్రజలకు ఇబ్బందులు ఉండకుండా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్/ భద్రతా ప్రమాణాలు పాటించాలని తెలిపారు. మైన్స్ అండ్ బ్లాస్టింగ్ చేసే వారు తప్పనిసరిగా సంబంధిత అధికారుల అనుమతులు తీసుకోవాలన్నారు. అనుమతులు లేకుండా మరియు నాణ్యతా ప్రమాణాలు లేకుండా బ్లాస్టింగులు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సేఫ్ బ్లాస్టింగ్ పద్ధతులను ఉపయోగించి ఇన్సిడెంట్ ఫ్రీ బ్లాస్టింగ్ చేయాలన్నారు. అనంతరం ఒరికా జనరల్ మేనేజర్స్ యోగేంద్ర నిగమ్, అంకిత్ సక్సేనా, వివేక్ సిన్హా సేఫ్టీ బ్లాస్టింగ్ పై ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ సదస్సులో సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, ఐపీఎస్, శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి, ఐపీఎస్., ఏడీసీపీ అడ్మిన్ నరసింహా, మాదాపూర్ ఏడీసీపీ వెంకటేశ్వర్లు, మాదాపూర్ ఏసీపీ శ్యామ్ ప్రసాద్ రావు, గచ్చిబౌలి, రాయదుర్గం, నార్సింగి ఇన్ స్పెక్టర్లు, బ్లాస్టింగ్ సెక్షన్ ఇన్ చార్జ్ గురుప్రసాద్, సీబీ మైనింగ్ ఎండీ సిబీ ఎం లూకోస్, సీబీ మైనింగ్ డైరెక్టర్ పి. నారాయణ రావు, ఒరికా జనరల్ మేనేజర్స్ యోగేంద్ర నిగమ్, అంకిత్ సక్సేనా, వివేక్ సిన్హా, రాహెజా ఐటి పార్క్, ఫీనిక్స్, ఎస్ వీ ఎస్ కన్ స్ట్రక్షన్స్, మరియు వివిధ కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.