వికారాబాద్ జిల్లా ప్రతినిధి:- పొలంలో మేక పడిందని పొలం యజమాని ఓ యువకుడిపై కొడవళితో దారుణంగా హత్య చేసిన సంఘటన వికారాబాద్ జిల్లాలో శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా ధరూరు మండలంలోని ధర్మపురం గ్రామానికి చెందిన బుద్ధ నరేష్(21) వద్ద రెండు ఎద్దులు,ఒకమేక ఉంది.ఈరోజు ఉదయం వాటిని మోపడననికి పోలాంకు వెళ్లడం జరిగింది. అదే గ్రామానికి చెంది పొలం యజమాని రావులపల్లి అశోక్ నరేషను కోపాపడ్డాడు. దీంతో వీరి ఇద్దరి మద్య గొడవ చోటుచేసుకుంది. దీంతో అశోక్ కోపం వచ్చి చేతిలో ఉన్నకొడవళిని తీసి నరేష్ తలపై వేశాడు.దీంతో నరేష్ అక్కడి కక్కడే మృతి చెందారు. అశోక్ కుటుంబ సభ్యుల అందరూ పారిపోయారు.