పరీక్షలు అయిపోయాయి.. ఆనందంతో సంవత్సరం పాటు చదివిన పుస్తకాలను రోడ్డు మీద చింపేసి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరిచారు మన యువత.. ఇదేనా మనం నేర్చుకునే చదువు?? మన భవిష్యత్తుని నిర్ణయించే విద్యని ఇలా రోడ్డుమీద చింపేయడమేనా??

చదువు లేని వాళ్ళు చిన్న ఉద్యోగాలు చేస్తూ రోడ్లు Clean (Sweepers) చేస్తుంటే, చదువుకున్న మేధావులు మాత్రం నవభారత నిర్మాణం చేస్తారో లేదో తెలియదు కానీ ఇలా మాత్రం చేస్తున్నారు…

School లో చదువుకున్నాం కదండీ…. Air pollution, sound pollution అని … అంతే భయంకరమైన pollution ఇదికూడా… ఇదేనా మనం చదువు నుంచి నేర్చుకునేది??…

చాలామంది Cricket 🏏 చూస్తుంటారు & అభిమానిస్తారు… మ్యాచ్ గెలిచాక వాళ్ళు వికెట్లు పైకెత్తి ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు, wickets, bat break చేసి కాదు.. మీరు ఎంతగానో ఇష్టపడే సినిమాలు కూడా సినిమా హిట్ అయిన తర్వాత వాళ్లు కేక్ కట్ చేసుకుని అందరికి అభినందనలు తెలుపుకుంటున్నారు కానీ ఆ Movie Reel తెచ్చి తగలపెట్టరు… ఆలోచించండి

దయచేసి నాదొక విన్నపం.. కనీసం పదోతరగతి రాయబోయే విద్యార్దులు అయిన ఇలా చేయకండి. తల్లితండ్రులు మీరు కూడా చెప్పండి.. పరీక్షలు అయిపోయేంత వరకు కూడా పిల్లలకు ఫోన్ ఇవ్వకండి, పదో తరగతి పరీక్షలు రాయబోయే బాల,బాలికలందరికీ పరీక్షలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను, మీ ఆనందమే తల్లిదండ్రుల ఆనందం, “కృషితో నాస్తి దుర్భిక్షం”(కష్టపడితేనే మన బాధలన్నీ తొలగుతాయి, ప్రయత్నం లేకుండా ఏ మార్పు పొందలేము). 💐🙏🏻చారి 💐