వరంగల్ అర్బన్ ప్రతినిధి :- పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ బలిదాన దివాస్ సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సమర్పణ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు వరంగల్ చౌరస్తాలో బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ గారి ఆధ్వర్యంలో సమర్పణ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్బంగా రావు పద్మ గారు మాట్లాడుతు జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షులు, బీజేపీ సిందంతకర్త పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి వర్ధంతిని పురస్కరించుకుని బీజేపీ జాతీయ పార్టీ ఆదేశానుసారం మన రాష్ట్రంలో ఫిబ్రవరి 11నుండి15 లోపల ప్రతి డివిజన్ మరియు మండల శక్తి కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని డివిజన్ మరియు మండల కేంద్రలలో నిర్వహించే ఈ కార్యక్రమంలో బూత్ కమిటీ సభ్యులు, పార్టీ సానుభూతిపరులు, ప్రజలు పాల్గొనే విధంగా తగిన చూసి ప్రతి ఒక్కరు కూడ యోజన చేయాలని రూ.10/- నుండి ఆ పైన ఎంత మేరకైన బీజేపీకి మద్దతు తెలియజేస్తు విరాళంగా సమర్పించుకోవచ్చు అని తెలియజేసారు. మోదీ యాప్ ద్వారా కూడా సమర్పణ చెల్లించవచ్చు అని అన్నారు. ఈ విధంగా జమచేసిన విరాళాలను సేకరించి నియోజకవర్గాల వారిగా జాబితా తయారుచేసి రాష్ట్ర పార్టీకి పంపిస్తామని తెలియజెశారు.

ఈయొక్క కార్యక్రమంలో బీజేపీ జిల్లా
పదాధికారులు మరియు నాయకులు సంగని జగదీశ్వర్, బాకం హరిశంకర్, కనుకుంట్ల రంజిత్, గోగికర్ అనిల్ కుమార్, గడల కుమార్, పులిశేరి ఉపేందర్, సముద్రాల పరమేశ్వర్, సతీశ్ షా, వలబోజు శ్రీనివాస్, మంతెన రమేష్, కట్ట ఈశ్వర్ ప్రసాద్, కందగట్ల సత్యనారాయణ, మాదాసు రాజు, హరీష్, మోహనచారి, కొటేశ్వర్, మల్లేష్ యాదవ్, రత్నాకర్, సూతరి గోపి, నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.