రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హంగామా ప్రారంభమైంది.మొదటి విడతలో 4,480 గ్రామ పంచాయతీలు, 39,832 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు రిటర్నింగ్‌ అధికారులు రేపు(సోమవారం) ఎన్నికల నోటీసులు జారీ చేయనున్నారు. దీంతో తొలి విడత నామినేషన్లు ప్రారంభం కానుంది. తర్వాత రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో ఈ నెల 9 వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.10న సాయంత్రం 5 వరకు నామినేషన్ల పరిశీలించనున్నారు. ఆ తర్వాత అర్హులైన అభ్యర్థుల జాబితాలను ప్రకటించనున్నారు.11న సాయంత్రం 5వరకు నామినేషన్లపై అప్పీళ్లను స్వీకరించి, 12న వాటిని పరిష్కరించనున్నారు.నామినేషన్ల ఉపసంహరణ గడువు 13న మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. ఆ తర్వాత బరిలో నిలిచిన తుది అభ్యర్థుల జాబితాలను రిటర్నింగ్‌ అధికారులు ప్రకటిస్తారు. 21న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు తొలి విడత పోలింగ్‌ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి అప్పటికప్పుడు ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత అదే రోజు ఉపసర్పంచ్‌ ఎన్నికలు జరపనున్నారు. తొలి విడతలో 39 రెవెన్యూ డివిజన్లు, 197మండలాల పరిధిలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి…