సైబరాబాద్ పోలీసులు నిర్వహిస్తున్న నిఘానేత్రం కార్యక్రమంలో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు హైటెక్ సిటీలోని ‘సిబీ మైనింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ’ విరాళం అందించింది. సిబీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సిబీ ఎమ్ లూకోస్ సోమవారం సైబరాబాద్ అడ్మిన్ ఏడిసిపి నరసింహ ఆధ్వర్యంలో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్ ను కలిసి రూ. 10 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సిపి సజ్జనార్ మాట్లాడుతూ సైబరాబాద్ పరిధిలో లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటికే 50 వేలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. వీటి నిర్వహణకు నెలకు లక్షన్నర కార్చు వస్తుందన్నారు. రక్షణ అనేది కేవలం పోలీసులకు మాత్రమే పరిమితమైన విషయం కాదన్నారు. సిసిటివి ల ఏర్పాటుకు కార్పొరేట్ సంస్థలు సైతం తమ వంతు బాధ్యతగా ముందుకు రావడం శుభపరిమాణమన్నారు. అనంతరం సిబీ ఎమ్ డీ సిబీ ఎమ్ లూకోస్ మాట్లాడుతూ సమాజ హితం కోసం చేస్తున్న ఈ మంచి కార్యక్రమంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజల రక్షణకు ఉద్దేశించి ఏర్పాటు చేస్తున్న నిఘానేత్రం కార్యక్రమంలో ప్రటీ కంపెనీ ముందుకు వచ్చి తమ సహకారాన్ని అందించాలని కోరారు.