నల్గొండ జిల్లా : మిర్యాలగూడ రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓ ప్రేమజంట రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.  మృతులు చివ్వెంల మండలం మాల్యా తండాకు చెందిన భాస్కర్ (28), బిరావత్ షాలుకు (25)గా గుర్తించారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడం వల్లనే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.