నర్సంపేట నియోజక వర్గం,
వరంగల్ రూరల్ జిల్లా-

చెన్నరావుపేట మండలం నుండి టిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు…
-టిఆర్ఎస్ పార్టీలో చేరిన కందిగడ్డ తండా, అవుసుల తండా, నడిగడ్డ తండా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు…
-నన్ను ఎమ్మెల్యే గా గెలిపించిన నియోజక వర్గ ప్రజలకు & కార్యకర్తలకు ఋణపడి ఉంటా- …
————————– ————–
రెండోసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుతో నర్సంపేట నియోజక వర్గం మరింత అభివృద్ధికి నోచుకోబోతుంది.. నర్సంపేట శాసన సభ్యులు శ్రీ. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కృషితో నియోజక వర్గానికి అభివృద్ధి & సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందుతున్నారు. ఇవన్నీ గమనించిన వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు గులాబీ దళంలో చేరుతున్నారు. తాజాగా చెన్నరావుపేట మండలం, కందిగడ్డ తండా, అవుసుల తండా, నడిగడ్డ తండా గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన గూగులోతు క్రిష్ణ (మాజీ వార్డు నెంబర్), సహదేవుడు వెంకన్న (మాజీ వార్డు మెంబర్), మాలి తులసి రామ్ (మాజీ ఉపసర్పంచ్) మాలోతు పాపా, బానోతు బిక్షపతి మూడు వినోద, మాలి రమేష్ (యూత్ అధ్యక్షులు) మూడు హరిలాల్, తానుగారు వీరన్న, గూగులోతు బిచ్చులతో పాటు సుమారు 150 కుటుంబాలు శ్రీ. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సమక్షంలో గులాబీ తీర్ధం పుచ్చుకున్నాయి. నూతనంగా పార్టీలోకి చేరిన వారికి నర్సంపేట శాసన సభ్యులు శ్రీ. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు…
కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కంది క్రిష్ణా రెడ్డి, మండల పార్టీ అధికార ప్రతినిధి భాల్నె వెంకన్న, RSS కన్వీనర్ బుర్రి తిరుపతి, పార్టీ ముఖ్య నాయకులు బద్దు నాయక్, జాటోతు స్వామీ, బానోతు రాంజీ & కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు….