-నన్ను ఎమ్మెల్యే గా గెలిపించిన నియోజక వర్గ ప్రజలకు & కార్యకర్తలకు ఋణపడి ఉంటా- పెద్ది…-బిజ్ ఈ న్యూస్

0
38


నర్సంపేట నియోజక వర్గం,
వరంగల్ రూరల్ జిల్లా.

-నల్లబెల్లి మండలం నుండి టిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు…
-నా గెలుపుకి సహాకరించిన యువ నాయకులకి నా కృతఙ్ఞతలు…
-నన్ను ఎమ్మెల్యే గా గెలిపించిన నియోజక వర్గ ప్రజలకు & కార్యకర్తలకు ఋణపడి ఉంటా- పెద్ది…


రెండోసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుతో నర్సంపేట నియోజక వర్గం మరింత అభివృద్ధికి నోచుకోబోతుంది.. నర్సంపేట శాసన సభ్యులు శ్రీ. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కృషితో నియోజక వర్గానికి అభివృద్ధి & సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందుతున్నారు. ఇవన్నీ గమనించిన వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు గులాబీ దళంలో చేరుతున్నారు. తాజాగా నల్లబెల్లి మండల కేంద్రం నుండి కాంగ్రెస్ యూత్ కి చెందిన పల్లికొండ రవి, నానబోయిన ఓదేలు, నానబోయిన గణేష్, పెద్దబోయిన బిక్షపతి, నానబోయిన రవి, నానబోయిన కుమార్ పాటు 30 మంది కుటుంబ సభ్యులకు నల్లబెల్లి ఎంపిపి బానోతు సారంగపాణి గారు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు…

కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోటి లింగాచారి, పార్టీ ముఖ్య నాయకులు సట్ల శ్రీనివాస్, కేతం శ్రీనివాస్, నాగేల్లి ప్రకాశ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here