ముంబయి : బుధవారం కూడా బంగారం ధర పెరిగింది. దేశీయ మార్కెట్ లో బంగారం ధర రూ. 33వేలకు చేరుకుంది. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ. 110 పెరిగి రూ. 32,800లకు చేరింది. పెళ్లిళ్ల సీజన్‌ వస్తుండడంతో స్థానిక నగల వ్యాపారుల నుంచి బంగారానికి డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో బంగారం ధర పెరిగిందని బులియన్ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. ఈ మూడు రోజుల్లో బంగారం ధర రూ. 300 పెరిగిందని ట్రేడింగ్ వర్గాలు వెల్లడించాయి. బుధవారం వెండి ధర కూడా పెరిగింది. బుధవారం ఒక్కరోజే  రూ. 300 పెరిగింది. దీంతో మార్కెట్ లో కిలో వెండి ధర రూ. 40,100 పలికింది. అంతర్జాతీయ  మార్కెట్ లో బంగారం, వెండి  ధరలు కాసింత తగ్గాయి. న్యూయార్క్‌ మార్కెట్ లో బంగారం ధర స్వల్పంగా తగ్గి ఔన్సు ధర 1,283.10 డాలర్లుగా ఉంది. వెండి ధర కూడా 0.26శాతం తగ్గి ఔన్సు ధర 15.67డాలర్లు పలికింది.