దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా మంగళవారం హన్మకొండ డివిజన్ తపాల ఐక్య కార్యచరణ సమితి (జేసిఏ) ఆధ్వర్యంలో హన్మకొండ ప్రధాన తపాల కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న ఉద్యోగులు . ఈ ఆందోళనలో ఎఫ్ఎన్పిఓ, ఎన్ ఎఫ్పిఓకు చెందిన సి క్లాస్ ఉద్యోగులు, పోస్ట్ మ్యాన్, గ్రూప్ డి ,ఎంటిఎస్ మరియు గ్రామీణ తపాల ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సమ్మెలో భాగంగా హన్మకొండ డివిజన్ పరిధిలోని జనగామ, పర్కాల ప్రధాన తపాల కార్యాలయం ముందు కూడా ఉద్యోగులు ఆందోళన చేశారు. ..సార్వత్రిక సమ్మె కారణంగా డివిజన్ పరిధిలోని అన్ని ప్రధాన, సబ్ పోస్టాఫీసు లన్నీ మూత పడ్డాయి. ఎలాంటి లావాదేవీలు జరుగలేదు. తపాల సేవలన్నీ నిలిచిన పోయాయి. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. .. కొత్త పెన్షన్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలనే ప్రధాన డిమాండ్ తో ఈ ఆందోళన చేశారు.