• ఇవ్వాళ్టితో రెండవ శాసనసభ సమావేశాలు ముగిశాయి.
 • ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు.
 • ఇవ్వాళ సభలో నేను వారసత్వంగా వచ్చిన పదవులు కావు.
 • అసెంబ్లీకి నన్ను ఏకగ్రీవంగా సభాపతిగా ఎన్నుకున్నందుకు సీఎం కేసీఆర్ తో పాటుగా అన్ని పక్షాల నేతలకు ధన్యవాదాలు.
 • రాష్ట్రంలో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తరువాత అహంకారం లేదు మరింత భాద్యత పెరిగింది.
 • సభలో రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసేందుకు అన్ని రంగాల పై క్లుప్తంగా చర్చలు జరపాల్సిన అవసరం ఉంది.
 • సభలో భవిష్యత్ లో సభ్యులందరు నాతో సహకరిస్తారని…హుందాగా వ్యవహరిస్తారని నాకు నమ్మకం ఉంది.
 • కేసీఆర్ క్యాబినెట్ లో నేను వ్యవసాయ శాఖామంత్రిగా పనిచేశాను..ఇవ్వాళ వ్యవసాయ రంగం దేశానికే ఆదర్శంగా నిలిచింది.
 • దేశమంతా ఇవ్వాళ రైతుబంధు, రైతుభిమా, 24గంటల కరెంట్ అమలు చూసి దేశంలో నేతలందరూ ఆశ్చర్యపోతున్నారు.
 • తెలంగాణ శాసనసభను సైతం దేశానికి ఆదర్శంగా ఉండేలా నేను ప్రణాళికలతో ముందుకు వెళ్తాను.
 • దేశంలో తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగంలో మొదటి స్థానంలో ఉన్నాము.
 • అదే విధంగా శాసనసభ వ్యవహాలలో కూడా మొదటి స్థానంలో ఉండేలా సభ్యులందరూ సహకరించాలి.
 • సభలో కొత్త సభ్యులు అనుకోని సందర్భంలో ఏదైనా తప్పులు చేసినట్లయితే అందరి సహకారం వాళ్లకు ఉండాలి.
 • గవర్నర్ ప్రసంగం రాష్ట్ర ప్రభుత్వ పాలనను దర్పణం పెట్టె విధంగా ఉంది.
 • గవర్నర్ ప్రసంగం పై సభలో అన్ని పార్టీల నుంచి ఐదుగురు సభ్యుల అనంతరం సీఎం వ్యాఖ్యానించారు.
 • ప్రతి ఎమ్మెల్యే సభను వినియోగించుకోవాలి.
 • సభ నియమాలు నిబంధనల పై కొత్త సబ్యులకు శిక్షణా తరగతులు ఉంటాయి.
 • అవసరాన్ని బట్టి శాసనసభను పనిధినాలను నిర్వహిస్తాము.
 • రాష్ట్ర ప్రయోజలను దృష్టిలో పెట్టుకొని ప్రతి సభ్యునికి మాట్లాడే అవకాశం తప్పకుండా ఉంటుంది…గాడి తప్పి మాట్లాడిన వారికి చర్యలు తప్పవు.

ప్రజలు ఎమ్మెల్యేల పై నమ్మకంతో సభకు పంపుతారు ఖచ్చితంగా అందరికి మాట్లాడే అవకాశం ఉంటుంది.

పార్టీ ఫిరాయింపు అంటే ఎమ్మెల్యేలు తమ సొంత ఇష్టంతో పార్టీ మారుతున్నారు..పార్టీల చేరికల పై తేడాలు ఉంటే చర్యలు తప్పవు

నియమనిబంధాలతో పనిచేసే వ్యక్తులకు ఏ పదవి అయినా బరువుకాదు

అసెంబ్లీ వ్యవహాల శాఖ వెబ్ సైట్ మరింత ఆధునీకరణ చేస్తున్నాము.