జగన్‌కి సాయం చేసేందుకే కేసీఆర్‌ తలసానిని ఏపీకి పంపించారని ఈరోజు మీడియా సమావేశంలో గాటుగా విమర్సించారు.
బీసీలకు తెలంగాణ కంటే ఏపీలోనే అన్ని విధాల న్యాయం జరుగుతోందని బోనబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు.
చంద్రబాబు నాయుడిని విమర్శించటమే ఫ్యాషన్‌గా పెట్టుకున్నారు. గుంటూరులో తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి నిర్వహకుడు బోనబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ నాయుడు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వ్యాఖ్యాలను తీవ్రంగా తప్పు బట్టారు. జగన్‌కి సాయం చేసేందుకే తలసానికి కేసీఆర్‌ ఏపీకి పంపాడని తలసాని మాటలు బట్టి అర్దమవుతుందన్నారు. తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కేసీఆర్‌, మోదీ చేతిలో కీలు బొమ్మగా మారి వాస్తవానికి విరుద్దంగా మాట్లాడటం సరికాదన్నారు. 54 శాతం బీసీ జనాభా వున్న తెలంగాణలో వారికి బడ్జెట్‌లో కేవలం రూ. 20 వేల కోట్లే కేసీఆర్‌ కేటాయించారు. కానీ 50 శాతం బీసీ జనాభా ఉన్న ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీ సబ్‌ప్లాన్‌కి రూ. 40 వేల కోట్లు కేటాయించారని చెప్పారు. బీసీలకు ప్రత్యేక బడ్జెట్‌ ఏర్పాటు చేసిన ఘనత టీడీపీదే. తెలంగాణ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బీసీలకు టీడీపీ 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే కేసీఆర్‌ వాటిని 22 శాతానికి తగ్గించారని గుర్తు చేశారు. ఏపీలో కీలక ఉపముఖ్యమంత్రి పదవి బీసీలకు కేటాయించటం జరిగింది. కానీ తెలంగాణలో బీసీలకు కేటాయించలేదని అన్నారు. ఉపముఖ్యమంత్రి సహా 8 కీలకమంత్రి పదవుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలకు ప్రాతినిధ్యం కల్పించారు. ప్రతిష్టాత్మక టీటీడీ చైర్మన్‌, ఏపీఐఐసీ చైర్మన్‌, తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటి చైర్మన్‌, నెల్లూరు, కృష్ణా జిల్లాల టీడీపీ అధ్యక్ష్యులుగా, హిందూపూర్‌ ఎంపీ ఇలా ముఖ్యమైన పధవుల్లో ఏపీలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. అనేకమంది బీసీలు టీడీపీలో ఎమ్యెల్యేలు, ఎమ్మెల్సీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా బీసీలే ఉన్నారు. కానీ టీఆర్‌ఎస్‌ రాష్ట్య్ర అధ్యక్ష పదవి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి కేసీఆర్‌ కుటుంబం చేతిలో ఉన్నాయి. రాజకీయం ప్రాతినిద్యం కల్పించటంగానీ, బడ్జెట్లో కేటాయింపులు సహా అన్ని విధాల బీసీలకు, యాదవులకు తెలంగాణ కంటే ఏపీలోనే ఎక్కువ న్యాయం జరుగుతోంది. తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. ఆయన చేసిన అవాస్తవాలను బీసీ సంఘాలన్ని ఖండిస్తున్నాయని అన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే కేసీఆర్‌, జగన్‌ కలిసి ఏపీలో పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. క్రైస్టియన్‌ మైనార్టీ పైనాన్స్‌ ఛైర్మన్‌ మద్దిరాల మ్యాణి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ మహిళలకు అత్యంత ప్రాధాన్యత కల్పించారని అన్నారు. మహిళలు స్వయంగా అభివృద్ది సాధించాలని వారి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలియజేశారు.సోషల్‌ మీడియాలో షర్మిల షర్మిల పై అసభ్య వార్తలు వస్తున్నాయని కేసుల పెట్టడం సరికాదని విమర్శించారు. ఈ కేసు వాస్తవం కాదని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర మీడియా కోఆర్టినేటర్‌ దారపనేని నరేంద్ర, నగర యువత అధ్యక్షడు ఆశోక్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.