హైదరాబాద్ ప్రతినిధి: జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ సీఐతో పాటు ఇద్దరు హోంగార్డులను బదిలీ చేస్తూ నగర పోలీసు కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ నవీన్‌కుమార్‌తోపాటు హోంగార్డులు మురళీకృష్ణ, వెంకట్‌రావు, సంజీవరెడ్డినగర్‌ ఎస్‌ఐలను హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో వీరు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో బదిలీవేటు పడి ఉంటుందని అధికారులుచెబుతున్నారు.